కొత్త ఎంఈవోలొచ్చారు..
Published Thu, Feb 9 2017 2:17 AM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM
ఏలూరు సిటీ : జిల్లాలో మండల విద్యాశాఖ అధికారుల (ఎంఈవో) పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ జరిగింది. జిల్లావ్యాప్తంగా అర్హులైన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సీనియార్టీ ఆధారంగా మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈవో)గా నియామకాలు చేపట్టారు. స్థానిక సర్వశిక్ష అభియాన్ జిల్లా కార్యాలయంలోని సమావేశమందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.మధుసూదనరావు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకూ కౌన్సెలింగ్ నిర్వహించి ఆయా మండలాలకు సంబంధించి ఎంఈవో పోస్టులను భర్తీ చేశారు.
చింతమనేని పేరుతో భయపెట్టిన యూనియన్
దెందులూరు నియోజకవర్గంలోని ఎంఈవో పోస్టులకు సంబంధించి ఒక ఉపాధ్యాయ సంఘానికి చెందిన నాయకులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుమతి లేకుండా ఇక్కడకు వస్తే ఇబ్బందులు తప్పవంటూ ఎమ్మెల్యే తరఫున వకాల్తా పుచ్చుకుని ప్రధానోపాధ్యాయులను భయపెట్టారు. ఈ నియోజకవర్గంలో దెందులూరు ఎంఈవో పోస్టు భర్తీ చేయగా, పెదపాడు ఎంఈవో పోస్టు మాత్రం ఖాళీగా మిగిలిపోయింది. ఇలా ఎమ్మెల్యే పేరు చెప్పి ప్రధానోపాధ్యాయులను భయపెట్టేందుకు ప్రయత్నించటాన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తప్పుబట్టారు. జిల్లాలో 42 ఎంఈవో పోస్టులు భర్తీ కాగా మూడు పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి.
3 ఎంఈవో, ఒక డీఐ పోస్టు ఖాళీ
జిల్లాలో ఇన్‌ఛార్‌్జల పాలనలో కొనసాగుతున్న మండల విద్యాశాఖ అ«ధికారి పోస్టుల్లో రెగ్యులర్ నియామకాలు చేపట్టారు. జిల్లాలో 48 మండలాల విద్యాధికారి పోస్టులు, ఏలూరు, భీమవరంలో రెండు అర్భన్ పాఠశాలల ఉప తనిఖీ అధికారి (డీఐ) పోస్టులు ఉన్నాయి. తాళ్లపూడి, ఆచంట మండలాలకు ఎంఈవో పోస్టులు మంజూరు కాలేదు. ఇక మిగిలిన 46 పోస్టుల్లో ఒకచోట రెగ్యులర్ ఎంఈవో ఉండగా 45 పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ చేపట్టారు. ఈ పోస్టులకు జిల్లావ్యాప్తంగా 204 మంది అర్హత కలిగిన ప్రధానోపాధ్యాయులను కౌన్సెలింగ్‌కు పిలిచారు. సీనియార్టీ జాబితా ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టులను భర్తీ చేశారు. వీరిలో 42 మంది ఆయా మండలాలను కోరుకోగా వారికి నియామక ఉత్తర్వులను డీఈవో అందజేశారు. పెదపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండల విద్యాశాఖ అధికారి పోస్టులు మాత్రం ఖాళీగానే మిగిలిపోయాయి. ఇక ఏలూరు అర్భన్ డీఐ పోస్టు భర్తీ చేయగా, భీమవరం డీఐ పోస్టు ఖాళీగా ఉంది.
కొత్తగా నియమితులైన ఎంఈవోలు వీరే
జంగారెడ్డిగూడెం – బి.రాముడు
ఏలూరు రూరల్ – కె.అన్నమ్మ
కొయ్యలగూడెం – జె.సురేష్‌బాబు
తణుకు – జి.సత్యజ్యోతి
యలమంచిలి – సీహెచ్ అరుణకుమారి
పోడూరు – ఎం.చిట్టిరాజు
పెంటపాడు – ఎం.శ్రీనివాస్
జీలుగుమిల్లి – కె.శ్రీనివాసరావు
బుట్టాయగూడెం – టి.బాబూరావు
చింతలపూడి – గుగ్గులోతు రామారావు
కామవరపుకోట – డి.సుబ్బారావు
గోపాలపురం – గుగ్గులోతు శ్రీనివాసరావు
టి.నరసాపురం – టి.రామమూర్తి
లింగపాలెం – కె.రామారావు
తాడేపల్లిగూడెం – వి.హనుమ
భీమవరం – బి.ఐజాక్ ఇజ్రాయెల్ న్యూటన్
కొవ్వూరు – జె.కెంపురత్నం
ఉండ్రాజవరం – వైవీ మాణిక్యాలరావు
దెందులూరు – ఎస్.సత్యనారాయణ
నరసాపురం – పి.పుష్పరాజ్యం
నిడదవోలు – పీవీ పాపారావు
పెదవేగి – సీహెచ్ బుద్ధవ్యాస్
చాగల్లు – వి.ఖాదిర్‌బాబు
ఇరగవరం – ఎస్.శ్రీనివాసరావు
అత్తిలి – ఎస్.నరసింహమూర్తి
పెరవలి – వి.హైమావతి
గణపవరం – పి.శేషు
భీమడోలు – వి.జయలక్ష్మి
పాలకోడేరు – ఏఏవీబీ సత్యానంద్
పాలకొల్లు – యం.గంగరాజు
పెనుగొండ – యం.కృష్ణారావు
కాళ్ల – డి.సీతారామరావు
పెనుమంట్ర – డి.శారదజ్యోత్స్న
దేవరపల్లి – వీఎస్‌ఎన్ మూర్తి
ఉంగుటూరు – డి.సుభాకరరావు
నల్లజర్ల – వీఎస్ రత్నకుమార్
పోలవరం – పి.కృష్ణ
వీరవాసరం – బి.వినాయకుడు
ద్వారకాతిరుమల – ఎస్.ధర్మదాస్
నిడమర్రు – వి.నరసింహమూర్తి
ఆకివీడు – ఎ.రవీంద్ర
మొగల్తూరు – సీహెచ్ లక్ష్మణప్రభాకరరావు
Advertisement
Advertisement