వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా జహీర్‌బాషా
Published Mon, Oct 24 2016 11:23 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
కర్నూలు(ఓల్డ్‌సిటీ): వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నంద్యాల నియోజకవర్గానికి చెందిన ఎన్.జహీర్ బాషా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని వివిధ పదవుల్లో నియమించినట్లు హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జిల్లా కార్యనిర్వాహక సభ్యుడిగా సీఎల్.ప్రహ్లాద్ (ఆలూరు), రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం.భాస్కర్‌రెడ్డి (పాణ్యం), పార్టీ కొలిమిగుండ్ల మండల ప్రెసిడెంట్‌గా మొలకల రాజారెడ్డి (బనగానపల్లె)లను నియమించారు. నంద్యాల మండల అధ్యక్షుడిగా అదే నియోజకవర్గానికి చెందిన బి.వెంకట భూపాల్‌రెడ్డి, పత్తికొండ మండల కార్యదర్శిగా అదే నియోజకవర్గానికి చెందిన కె.కారుమంచప్ప నియమితులయ్యారు.
Advertisement
Advertisement