జిల్లా బ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ఎంపిక
Published Sun, Dec 11 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM
రాజమహేంద్రవరం సిటీ :
జిల్లా బ్రాహ్మణ సంఘం ఆద్వరంలో పలు విభాగాలకు నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. ఆదివారం స్థానిక మల్లిగ సత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియామకం పొందిన వారంతా ప్రమాణస్వీకారం చేశారు. జిల్లా బ్రాహ్మణ సంఘం కమిటీ నూతన అధ్యక్షుడిగా దంతూరి సత్యప్రసాద్, కార్యదర్శిగా మంత్రి ప్రగడ వేణుగోపాల్, కోశాధికారిగా గాడేపల్లి సత్యనారాయణ ఎంపికయ్యారు. ఈసందర్భంగా జిల్లా పురోహిత సంఘం అ««దl్యక్షుడిగా ఆకెళ్ల మురళీకృష్ణ, జిల్లా యువజన విభాగం అ«««దl్యక్షుడిగా ఆకొండి మహేశ్ శర్మ, జిల్లా ఆధ్యాత్మిక విభాగం అధ్యక్షుడిగా నాగాభట్ల సుబ్రమణ్యం, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా చీమలకొండ వీరభద్రప్రసాద్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా తేజోమూర్తుల శ్రీదేవి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. పొన్నాడ హనుమంతరావు,మళ్లపురాజు డొక్కా హరనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement