committee selection
-
లోక్‌పాల్ ఎంపిక కమిటీ నియామకం
న్యూఢిల్లీ: అవినీతి నిరోధం కోసం నియమించనున్న లోక్‌పాల్‌కు చైర్పర్సన్, ఇతర సభ్యులను ఎంపిక చేసేందుకు ఓ కమిటీని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రమేయం లేకుండానే కేంద్ర ప్రభుత్వం గురువారం నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల ఈ కమిటీ లోక్‌పాల్ చైర్పర్సన్, సభ్యులను ఎంపిక చేస్తుంది. భారతీయ స్టేట్ బ్యాంక్ మాజీ చైర్‌వుమన్ అరుంధతీ భట్టాచార్య, ప్రసార భారతి చైర్మన్ సూర్య ప్రకాశ్, ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్ కుమార్, అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సఖ రామ్ సింగ్ యాదవ్, గుజరాత్ మాజీ డీజీపీ షబ్బీర్ హుస్సేన్ ఖండ్వావాల, రాజస్తాన్ కేడర్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి లలిత్ పన్వార్, మాజీ సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్‌లు ఈ ఎంపిక కమిటీలో సభ్యులుగా ఉంటారని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘లోక్‌పాల్ చట్టంలో ఉన్న నిబంధనలను అనుసరించి లోక్‌పాల్ ఎంపిక జరుగుతోంది’ అని సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. అయితే లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే లేకుండానే ఈ ఎనిమిది మంది కమిటీని కేంద్రం నియమించింది. -
కాంగిరేసు కసరత్తు
సాక్షి, జనగామ/సాక్షి, వరంగల్ రూరల్: దస్తు ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ‘హస్తం’ అనుసరించాల్సిన వ్యూహాలు, విధానపరమైన నిర్ణయాలతోపాటు అత్యంత కీలకంగా ఉండే మేనిఫెస్టో తయారీ కోసం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాలతో బుధవారం తొమ్మిది కమిటీలను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ బుధవారం ప్రకటించారు. ఈ కమిటీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, సీతక్క, వేం నరేందర్ రెడ్డి, గిరిజన కాంగ్రెస్ జాతీయ నాయకుడు బెల్లయ్య నాయక్‌ను వివిధ కమిటీల్లో సభ్యులుగా నియమించారు. అత్యంత కీలకమైన కోర్ కమిటీలో పొన్నాల లక్ష్మయ్యకు అవకాశం కల్పించారు. -
జిల్లా బ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ఎంపిక
రాజమహేంద్రవరం సిటీ : జిల్లా బ్రాహ్మణ సంఘం ఆద్వరంలో పలు విభాగాలకు నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. ఆదివారం స్థానిక మల్లిగ సత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియామకం పొందిన వారంతా ప్రమాణస్వీకారం చేశారు. జిల్లా బ్రాహ్మణ సంఘం కమిటీ నూతన అధ్యక్షుడిగా దంతూరి సత్యప్రసాద్, కార్యదర్శిగా మంత్రి ప్రగడ వేణుగోపాల్, కోశాధికారిగా గాడేపల్లి సత్యనారాయణ ఎంపికయ్యారు. ఈసందర్భంగా జిల్లా పురోహిత సంఘం అ««దl్యక్షుడిగా ఆకెళ్ల మురళీకృష్ణ, జిల్లా యువజన విభాగం అ«««దl్యక్షుడిగా ఆకొండి మహేశ్ శర్మ, జిల్లా ఆధ్యాత్మిక విభాగం అధ్యక్షుడిగా నాగాభట్ల సుబ్రమణ్యం, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా చీమలకొండ వీరభద్రప్రసాద్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా తేజోమూర్తుల శ్రీదేవి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. పొన్నాడ హనుమంతరావు,మళ్లపురాజు డొక్కా హరనాథ్ తదితరులు పాల్గొన్నారు.