
పొన్నాల లక్ష్మయ్య, సీతక్క, బలరాం నాయక్, రాపోలు ఆనందభాస్కర్, దొంతి మాధవరెడ్డి, బెల్లయ్య నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, వేం నరేందర్‌రెడ్డి
సాక్షి, జనగామ/సాక్షి, వరంగల్ రూరల్: దస్తు ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ‘హస్తం’ అనుసరించాల్సిన వ్యూహాలు, విధానపరమైన నిర్ణయాలతోపాటు అత్యంత కీలకంగా ఉండే మేనిఫెస్టో తయారీ కోసం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాలతో బుధవారం తొమ్మిది కమిటీలను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ బుధవారం ప్రకటించారు.
ఈ కమిటీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, సీతక్క, వేం నరేందర్ రెడ్డి, గిరిజన కాంగ్రెస్ జాతీయ నాయకుడు బెల్లయ్య నాయక్‌ను వివిధ కమిటీల్లో సభ్యులుగా నియమించారు. అత్యంత కీలకమైన కోర్ కమిటీలో పొన్నాల లక్ష్మయ్యకు అవకాశం కల్పించారు.