రాహుల్‌ సభతో వ్యవసాయానికి దశ,దిశ | Telangana: Congress Leaders Reviewed Rahul Assembly Arrangements | Sakshi
Sakshi News home page

రాహుల్‌ సభతో వ్యవసాయానికి దశ,దిశ

Published Tue, May 3 2022 3:24 AM | Last Updated on Tue, May 3 2022 3:24 AM

Telangana: Congress Leaders Reviewed Rahul Assembly Arrangements - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న భట్టి.చిత్రంలో ఉత్తమ్, గీతారెడ్డి, టి.జీవన్‌రెడ్డి తదితరులు 

సాక్షిప్రతినిధి, వరంగల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో నష్టపోతున్న అన్నదాతలకు భరోసా ఇవ్వడం కోసం పోరాటాల చరిత్ర కలిగిన ఓరుగల్లునుంచే మరో రైతు ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. వరంగల్‌లో నిర్వహించే రాహుల్‌ గాంధీ (రైతు సంఘర్షణ) సభ తెలంగాణలో వ్యవసాయరంగానికి దశ–దిశ చూ పించే చారిత్రక ఘట్టంగా మిగిలిపోనుందన్నారు.

వరంగల్‌ ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో జరగనున్న సభ ఏర్పాట్లను సోమవారం కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీతక్క, టి.జీవన్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, జె.గీతారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొన్నా ల లక్ష్మయ్య, బలరాం నాయక్‌ తదితరులతో కలసి భట్టి పరిశీలించారు. అనంతరం మీడియా సమావే శంలో ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతలనుంచి పారిపోయాయని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్, బీజేపీ పాలకులు రైతులను, వ్యవసాయాన్ని రాజకీయ అవసరం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ పా ర్టీ ధాన్యం కొనుగోలు చేయాలని ఢిల్లీలో ధర్నా చేస్తే, బీజేపీ గల్లీలో ధర్నాలు చేసి కొనుగోలు బాధ్య త తమది కాదన్నట్టుగా విడ్డూరంగా వ్యవహరించా యని భట్టి దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను ఎండ గట్టడానికి ఈ నెల 6వ తేదీన రైతు సంఘర్షణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతుల పక్షాన పోరాడుతున్న రాహుల్‌ గాంధీకి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి ‘మన సభ – మన పోరాటం’ నినాదంతో ప్రతి రైతు కదలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement