విమానంలో భద్రకాళి! | flight | Sakshi
Sakshi News home page

విమానంలో భద్రకాళి!

Published Wed, Feb 4 2015 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

flight

 భువనేశ్వర్/న్యూఢిల్లీ:  విమానమే కదా ఎవరూ పెద్దగా చూడరు లే.. అనుకున్నాడు! వెనక సీటు నుంచి చేయి పెట్టి ఆ మహిళను తడమడానికి యత్నించాడు!!! అంతే..ఆ మహిళ భద్రకాళి అవతారమెత్తింది. విమానంలోనే ఆ వృద్ధ కామాంధుడిని పట్టుకొని దుమ్ముదులిపింది. పెద్దగా అరిచి, అందరినీ పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. ప్రయాణికులందరి ముందు సిగ్గుతో చచ్చిపోయేంతగా అవమానపరి చింది.

అంతటితో ఊరుకుందా.. ఈ తతంగాన్ని తన సెల్‌తో వీడియో తీసి యూ ట్యూబ్ లో పెట్టింది. ఫోన్ ద్వారానే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఢిల్లీ నుంచి భువనేశ్వర్ వస్తున్న ఇండిగో విమానంలో జనవరి 27న ఈ ఘటన చోటుచేసుకుంది. భువనేశ్వర్‌కు చెందిన ఓ 60 ఏళ్ల వ్యాపారవేత్త సింగపూర్ నుంచి భువనేశ్వర్‌లోని తన తండ్రి ఇంటికి వస్తూ విమానంలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన అతణ్ణి విమానం దిగగానే పోలీసులు అరెస్టు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement