♦ గుంటూరు జిల్లాలో 80 ఎంపీఈఓ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ గుంటూరు జిల్లాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన బహుళార్థక ప్రయోజన విస్తరణ అధికారి (ఎంపీఈఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వాని స్తోంది. మొత్తం ఖాళీలు 80. దరఖాస్తుకు చివరి తేది జనవరి 16. వివరాలకు www.guntur.nic.in చూడొచ్చు.
♦ విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో స్పెషల్ రిక్రూట్‌మెంట్
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ (వీఎస్‌పీ).. వికలాంగుల కోటాలో వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ, జూనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 48. దరఖాస్తుకు చివరి తేది జనవరి 20. వివరాలకు www.vizagsteel.com చూడొచ్చు.
♦ హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీలు
హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ .. టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 127. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జనవరి 23న ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 12. వివరాలకు www.hecltd.com చూడొచ్చు.
♦ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సెన్సైస్‌లో 48 పోస్టులు
బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సెన్సైస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్‌స.. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 48. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 20. వివరాలకు www.nimhans.ac.in చూడొచ్చు.
♦ సీఆర్‌ఐడీఏలో వివిధ పోస్టులు
ైెహ దరాబాద్‌లోని ఐసీఏఆర్ అనుబంధ సంస్థ.. సెంట్రల్ రీసెర్‌చ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ (సీఆర్‌ఐడీఏ).. వివిధ విభాగాల్లో ఫాం అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, లైబ్రేరియన్, ఫీల్డ్‌మెన్, ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్, లోయర్ డివిజన్ క్లర్‌క పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 13. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 8. వివరాలకు www.crida.in చూడొచ్చు.
♦ హెచ్‌ఈసీఎల్‌లో 250 పోస్టులు
హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఈసీఎల్).. వివిధ విభాగాల్లో మెషినిస్ట్, టర్నర్, వెల్డర్ కమ్ గ్యాస్ కట్టర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఫర్గర్ కమ్ హీట్ ట్రీటర్, రిగ్గర్ కమ్ క్రేన్ ఆపరేటర్, మౌల్డర్/ఫౌండ్రీమెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 250. దరఖాస్తుకు చివరి తేది జనవరి 19. వివరాలకు www.hecltd.com చూడొచ్చు.
♦ ఐసీఏఆర్ అనుబంధ సంస్థలో 110 పోస్టులు
న్యూఢిల్లీలోని ఐసీఏఆర్ అనుబంధ సంస్థ.. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్‌చ ఇన్‌స్టి ట్యూట్‌లో టెక్నికల్ అసిస్టెంట్/హిందీ ట్రాన్‌సలేటర్, టెక్నీషి యన్/లైబ్రరీ అసిస్టెంట్/ ఫిట్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 110. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 5. వివరాలకు www.iari. res.in చూడొచ్చు.
♦ ఎన్‌ఎఫ్‌ఎల్‌లో 89 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
నేషనల్ ఫర్టిలైజర్‌స లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్).. వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి గేట్-2015లో ఉత్తీర్ణత సాధించిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 89. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 2. వివరాలకు www.nationalfertilizers.com చూడొచ్చు.
♦ సీఈఎల్‌లో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, మేనేజర్ పోస్టులు
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సీఈఎల్).. కాంట్రాక్ట్, డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, సీనియర్ టెక్నికల్ మేనేజర్, మేనేజర్, టెక్నికల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 34. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 12. వివరాలకు www.celindia.co.in చూడొచ్చు.
♦ సీపీసీఆర్‌ఐలో 25 పోస్టులు
కేరళలోని ఐసీఏఆర్ అనుబంధ సంస్థ.. సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్‌చ ఇన్‌స్టిట్యూట్ (సీపీసీఆర్‌ఐ) వివిధ విభాగాల్లో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 25. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 22. వివరాలకు www.cpcri.gov.in చూడొచ్చు.
♦ పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో వివిధ పోస్టులు
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. వివిధ విభాగాల్లో డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్ (కంపెనీ సెక్రటరీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 17. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 12. వివరాలకు www.po wergridindia.com చూడొచ్చు.
♦ టెక్స్‌టైల్స్ కమిటీలో అకౌంటెంట్, ఎల్‌డీసీ పోస్టులు
ముంబైలోని టెక్స్‌టైల్స్ కమిటీ.. వివిధ విభాగాల్లో అకౌంటెంట్, లోయర్ డివిజన్ క్లర్‌క పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీలు 15. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 5. వివరాలకు www.textilescommittee.nic.in చూడొచ్చు.
♦ గ్రూపు-2 పోస్టులు పెంచాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడిచినా గ్రూప్-2 పోస్టులను పాక్షికంగానే భర్తీ చేస్తున్నారని, మిగిలిన సర్వీసులకు ఎందుకు నోటిఫికేషన్లు విడుదల చేయలేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. మంగళవారం సచివాలయంలో మాట్లాడుతూ.. గ్రూప్-2 పోస్టులను 3,500కు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1, 3, 4 పోస్టులకు, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు వినతి పత్రం అందజేశారు.
♦ అర్హులకే జూనియర్ లెక్చరర్ పోస్టులివ్వాలి పీఆర్‌టీయూ టీఎస్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: జూనియర్ లెక్చరర్ పోస్టుల్లో అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాలని మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మకు పీఆర్‌టీయూ-తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హర్షవర్ధన్‌రెడ్డి, చెన్నయ్య విజ్ఞప్తి కోరారు. ప్రస్తుతం సర్వీసు లేకపోవడం వల్లే జేఎల్‌గా పదోన్నతులు రావడం లేదని, సర్వీసు రూల్స్ త్వరలో రాబోతున్న నేపథ్యంలో కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తే స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు రావని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు 60 శాతం జేఎల్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించే వీలుందని, సర్వీసు రూల్స్ న్యాయ వివాదంలో చిక్కుకోవడంతో స్కూల్ అసిస్టెంట్లకు అన్యాయం జరుగుతోందన్నారు.
♦ ‘క్రాఫ్ట్, ల్యాండ్ సర్వేయింగ్ పరీక్షల ఫీజు చెల్లించండి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బోర్డు టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సంస్థ (ఎస్‌బీటీఈటీ) ఈనెలాఖరు/వచ్చే నెలలో నిర్వహించే సీసీఐసీ, క్రాఫ్ట్, ల్యాండ్ సర్వేయింగ్ పరీక్షలకు హ జరు కావాలనుకునే అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని ఎస్‌బీటీఈటీ ఒక ప్రకటనలో తెలిపింది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్, పరీక్ష ఫీజు వివరాలను తమ వెబ్‌సైట్‌లలో (www.sbtet.telangana.gov.in, http://ousbtet. net/ccicporta) పొందవచ్చని పేర్కొంది.
ఉద్యోగ సమాచారం
Published Wed, Jan 13 2016 4:23 AM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM
Advertisement
Advertisement