
ప్రతీకాత్మక చిత్రం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటలు, కాలిబాట దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. నేటి నుంచి మూడు రోజులపాటు తిరుమలలో వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి.
ఉత్సవాలకు వసంత మండపం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. గురువారం తిరుప్పావడ సేవతో పాటు పలు ఆర్జిత సేవలు రద్దు చేశారు. రేపు(శుక్రవారం) స్వర్ణ రథంపై శ్రీవారిని ఊరేగిస్తారు. మద్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరుగుతుంది.