ఆన్‌లైన్‌లో అర్జితసేవా టిక్కెట్లు
తిరుమల: తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్లను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి టీటీడీ వెబ్‌సైట్‌లో టిక్కెట్లను అందుబాటులో ఉన్నాయి. 2017 జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన 1,00,147 అర్జిత సేవా టిక్కెట్లను ఆన్ లైన్ లో భక్తులకు అందుబాటులో ఉంచారు. నిత్య సేవలతో పాటు, వారపు సేవా టిక్కెట్లను భక్తులు వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.
కాగా ఈ నెల 26 నుంచి డిసెంబర్ 4 వరకు తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలను జరగనున్నాయి. డిసెంబర్ 4న పంచమి తీర్థ మహోత్సవాన్ని నిర‍్వహిస్తారు. ఈ సందర్భంగా పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించవచ్చని ఈవో సాంబశివరావు తెలిపారు. అదేవిధంగా
త్వరలో సర్వదర్శనం భక్తులకు వసతి సముదాయ నిర్మాణం జరగనున్నట్టు ఆయన తెలిపారు. వెయ్యి కాళ్ల మండపాన్ని కూడా అనుసంధానిస్తామని సాంబశివరావు తెలిపారు.
టికెట్ల వివరాలు
అర్చన 190
తోమల సేవ 190
సుప్రభాతం 9,073
అష్టదళపాదపద్మారాధన 160
విశేషపూజ 3,200
నిజపాదదర్శనం 2,604
కల్యాణోత్సవం 20,500
వసంతోత్సవం 22,360
సహస్రదీపాలంకర సేవ 25,175
వూంజల్‌సేవ 5,300
అర్జిత బ్రహ్మోత్సవం 11,395