శ్రీవారి అర్జిత సేవా టికెట్లు విడుదల
శ్రీవారి అర్జిత సేవా టికెట్లు విడుదల
Published Fri, Apr 7 2017 12:48 PM | Last Updated on Mon, Aug 20 2018 4:09 PM
తిరుమల: తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్లను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. జులై నెలకు సంబంధించి 58, 067 సేవా టికెట్లను భక్తులకోసం అందుబాటులోకి తెస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి టీటీడీ వెబ్‌సైట్‌లో ఈ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.
సుప్రభాతం 6,542, తోమాల 120, అర్చన 120 అష్టాదళం 60, విశేషపూజ 1,875, నిజపాద దర్శనం 1,500, కల్యాణోత్సవం 11,250, ఊంజల్ సేవ 3 వేలు, అర్జిత బ్రహ్మోత్సవం 6,450 వసంతోత్సవం 12,900, సహస్ర దీపాలంకరణ సేవ 14,250 టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 2.68 కోట్లమంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని గత ఏడాది కంటే 20.69 లక్షలమంది భక్తులు అదనంగా శ్రీవారిని దర్శించుకున్నారని ఆయన చెప్పారు. శ్రీవారి హుండీ ద్వారా 1,038 కోట్ల ఆదాయం లభించిందని తెలిపారు. నోట్ల రద్దు వల్ల హుండీ ఆదాయం కొంత మేరకు తగ్గిందని టీటీడీ ఈవో సాంబశివరావు తెలియజేశారు.
Advertisement
Advertisement