vasanthotsavam
-
తిరుమల శ్రీవారి సన్నిధిలో వైభవంగా వసంతోత్సవాలు (ఫొటోలు)
-
భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా వసంతోత్సవం వేడుకలు (ఫోటోలు)
-
ఏప్రిల్ 24 నుంచి తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 24 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల వసంతోత్సవాలు జరుగనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈ కారణంగా రెండోరోజు నిర్వహించే స్వర్ణ రథోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది. వసంత రుతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవం’అని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామికి సమర్పించి వివిధ ఫలాలను స్వామికి నివేదిస్తారు. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లు ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాలు జరిగే మూడు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి సేవకుల స్వచ్ఛంద సేవలు నిలుపుదల దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు స్వచ్ఛందంగా పాల్గొనే శ్రీవారి సేవను టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి సేవకు వచ్చే వలంటీర్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది. తదుపరి శ్రీవారి సేవ ప్రారంభమయ్యే తేదీలను ముందుగానే తెలియజేస్తామని తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో శ్రీవారి సేవకు రాదలచిన వలంటీర్లు ఈ మార్పును గమనించి తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇక్కడ చదవండి: హన్మంతుని జన్మస్థలంపై ఆధారాలు ప్రకటించిన టీటీడీ భక్తులకు మరింత సులభతరంగా ‘తిరుమల’ గదులు -
రేపటి నుంచి తిరుమలలో వసంతోత్సవాలు
-
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటలు, కాలిబాట దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. నేటి నుంచి మూడు రోజులపాటు తిరుమలలో వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలకు వసంత మండపం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. గురువారం తిరుప్పావడ సేవతో పాటు పలు ఆర్జిత సేవలు రద్దు చేశారు. రేపు(శుక్రవారం) స్వర్ణ రథంపై శ్రీవారిని ఊరేగిస్తారు. మద్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరుగుతుంది. -
ఘనంగా ముగిసిన శ్రీరామనవమి ఉత్సవాలు
► వాడవాడలా వసంతోత్సవాలు రాజంపేట టౌన్: గత తొమ్మిదిరోజుల పాటు ఘనంగా జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. నవమి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 13వ తేదీ పట్టణంలోని అనేక ప్రాంతాల్లో, పలు గ్రామాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణోత్సవం అనంతరం వసంతోత్సవాలు నిర్వహించడం సాంప్రదాయం కావడంతో శుక్రవారం అనేక ప్రాంతాల్లో వసంతోత్స కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సీతారాముల కళ్యాణ ఉత్సవ మూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో వయోబేధం లేకుండా అన్ని వయస్సుల వారు పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు, రంగునీళ్ళు చల్లుకున్నారు. పలు ప్రాంతాల్లో పురుషులతో పాటు మహిళలు కూడా వసంతోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వామివారి ఊరేగింపు వెంబడి యువకులు బ్యాండు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. అలాగే పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. పలువురు కర్రసాము వంటి కార్యక్రమాలను చేసి అబ్బురపరిచారు. -
తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం
-
వసంతోత్సవం ప్రారంభం
తిరుమల: తిరుమలలోని వసంత మండపంలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించారు. శనివారం నుంచి జరుగుతున్న ఈ వేడుకల కోసం వసంత మండపంలో టీటీడీ ఉద్యాన శాఖ భారీ అలంకరణలు చేపట్టింది. ఈవో డి.సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు సూచనల మేరకు ఉద్యాన శాఖ పర్యవేక్షకులు శ్రీనివాసులు ఈ అలంకరణను పర్యవేక్షించారు. వసంత మండపాన్ని ప్రకృతి ఒడిలో ఉన్నట్లుగా రూపొందించారు. రకరకాల జంతువులు, వృక్షాలు, ప్రకృతిలోని జంతువులన్నీ విచ్చేసినట్లుగా మండపాన్ని తీర్చిదిద్దారు. వసంతోత్సవ వేదికను సువాసనలను వెదజల్లే, చల్లదనాన్ని కల్పించే వట్టివేర్లతో అల్లారు. రంగురంగుల పుష్పాలను ఉత్సవాలకు తీసుకువచ్చారు. సహజత్వం ఉట్టిపడేలా వసంత మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మూడు రోజులపాటు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు తితిదే ప్రకటించింది. -
కనుల పండువగా వసంతోత్సవం
ద్వారకా తిరుమల : చిన వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు మంగళవారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఉదయం ఆలయంలో చూరో్ణత్సవం, వసంతోత్సవం కార్యక్రమాలను అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో ఘనంగా నిర్వహించారు. శ్రీవారి వసంతోత్సవం తిరువీధుల్లో ఘనంగా జరిపారు. రాత్రి ఆలయ ఆవరణలో స్వామివారికి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీ పుష్ప యాగోత్సవాన్ని ఆలయ అర్చకులు, పండితులు వైభవోపేతంగా నిర్వహించారు. వసంతోత్సవం ఇలా.. ఆలయ కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం అర్చనాది కార్యక్రమాలు జరిపారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లకు వసంతాలను సమర్పించారు. అర్చకులు శ్రీ స్వామివారిని కీర్తిస్తూ వడ్లను దంచారు. అనంతరం భక్తులకు వసంతాలను వేడుకగా చల్లారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి సతీమణి భాగ్యలక్ష్మి కల్యాణ మూర్తులకు వసంతాలు సమర్పించారు. ఎంతో వేడుకగా జరిగిన ఈ ఉత్సవం భక్తులను అలరించింది. నేత్రపర్వంగా ద్వాదశ కోవెల ప్రదక్షిణలు దేవాలయ ప్రాంగణంలో ఉభయ దేవేరులతో శ్రీనివాసమూర్తికి 12 ప్రదక్షిణలు, 12 సేవా కాలాలు, 12 రకాల పిండి వంటలతో నివేదన కార్యక్రమాలు రాత్రి కనుల పండువగా జరిపారు. ఈ ద్వాదశ కోవెల ప్రదక్షిణలో అర్చకులు, పండితులు, భక్తులు, అధికారులు పాల్గొన్నారు. ఒక్కో ప్రదక్షిణతో ఒక్కో సేవాకాలాన్ని నిర్వహించారు. అలాగే ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో పిండివంటను ఆరగింపుచేసి స్వామికి హారతులనిచ్చారు. వీణా, వేణువు, మృదంగం, గానం, నృత్యం, శృతి, శ్మ్రుతి, ద్రవిడ వేదం, బేరి, కాహలము, గంటారావం, నిశ్వబ్దం వెరసి 12 సేవలు, 12 ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పవళింపుసేవా మందిరాన్ని సుగంధ భరిత పుష్పమాలికలతో అలంకరించారు. తరువాత శ్రీపుష్పయాగోత్సవాన్ని వేద మంత్రోచ్ఛరణలతో అర్చకులు, పండితులు వైభవంగా జరిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. -
తిరుమలలో వైభవంగా వసంతోత్సవం