► వాడవాడలా వసంతోత్సవాలు
రాజంపేట టౌన్: గత తొమ్మిదిరోజుల పాటు ఘనంగా జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. నవమి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 13వ తేదీ పట్టణంలోని అనేక ప్రాంతాల్లో, పలు గ్రామాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణోత్సవం అనంతరం వసంతోత్సవాలు నిర్వహించడం సాంప్రదాయం కావడంతో శుక్రవారం అనేక ప్రాంతాల్లో వసంతోత్స కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈసందర్భంగా సీతారాముల కళ్యాణ ఉత్సవ మూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో వయోబేధం లేకుండా అన్ని వయస్సుల వారు పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు, రంగునీళ్ళు చల్లుకున్నారు. పలు ప్రాంతాల్లో పురుషులతో పాటు మహిళలు కూడా వసంతోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వామివారి ఊరేగింపు వెంబడి యువకులు బ్యాండు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. అలాగే పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. పలువురు కర్రసాము వంటి కార్యక్రమాలను చేసి అబ్బురపరిచారు.
ఘనంగా ముగిసిన శ్రీరామనవమి ఉత్సవాలు
Published Fri, Apr 14 2017 4:31 PM | Last Updated on Tue, Nov 6 2018 5:52 PM
Advertisement