sita ramula kalyanotsavam
-
భద్రాద్రి బ్రహ్మోత్సవాలు.. సీతారాముల కళ్యాణం
-
సీతారాముల కళ్యాణం ఎందుకు చేస్తారంటే...
-
శ్రీరాముడి జననం, కల్యాణం నవమి రోజునే
-
రామయ్య పెళ్లికి ముస్తాబు
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో అభిజిత్ లగ్న సుముహూర్తమున పాంచరాత్ర ఆగమం ప్రకారం శ్రీసీతారామచంద్రుల తిరు కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మిథిలా స్టేడియంలో స్వామివారి కల్యాణ వేడుక శాస్త్రోక్తంగా జరగనుంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాములవారి శిరస్సులపై అర్చక స్వాములు జీలకర్ర బెల్లం ఉంచి కల్యాణ ఘట్టాన్ని కమనీయంగా జరుపుతా రు. ఈ మేరకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకల సందర్భంగా రామాలయం విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి మిథిలా స్టేడియం ఎదురుగా ఉన్న ఉత్తర ద్వారం వద్ద ఎదుర్కోలు ఉత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. సీతమ్మవారి తరఫున కొందరు, రామయ్య వారి తరఫున కొందరు అర్చకులు విడిపోయి ‘మా వంశం గొప్పదంటే మా వంశం గొప్పదంటూ’వేడుకను రక్తి కట్టించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సీతారాముల కల్యాణానికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ము త్యాల తలంబ్రాలు సమర్పించడం తానీషా కాలం నుంచి వస్తున్న సం ప్రదాయం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ ముత్యాల తలం బ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉండగా.. వరుసగా ఆరోసారి ఆయన గైర్హాజరవుతున్నారు. దీంతో సర్కారు తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. -
సింగపూర్‌లో నేత్రపర్వంగా శ్రీ సీతారాముల కళ్యాణం
సింగపూర్ : సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో స్థానిక శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయ సమీపంలోని పి.జి.పి. హాల్లో భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణం అట్టహాసంగా, భక్తుల రామనామ సంకీర్తనల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా భద్రాచలం నుండి శ్రీ సీతారామ, లక్ష్మణ, హనుమ సమేతంగా భద్రాచల అర్చక బృందం సింగపూర్ వచ్చి శ్రీ సీతారామల కళ్యాణం జరిపించారు. అనంతరం భక్తులకు పానకం, వడపప్పు, కళ్యాణ భోజన వితరణ చేశారు. రామరక్షాస్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణ, భక్తుల అర్చన ఇతర సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించి, ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ స్వామి భద్రాచలం నుండి సింగపూర్ రావడం, భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఏవిధంగా నిర్వహిస్తారో అదేవిధంగా జరుపుకోవడం మనందరి అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహాయసహకారాలందించిన భద్రాచల దేవస్థానం సమన్వయకర్త పద్మజారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సుమారు రెండువేల మంది పైగా హాజరయ్యారని అందరికీ కల్యాణ తలంబ్రాలు అందించామని కార్యదర్శి సత్య చిర్ల పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుటకు సహాయసహకారాలు అందించిన కార్యవర్గ సభ్యులకు, స్థానిక దేవాలయాల కమిటీలకు, కళ్యాణంలో పాల్గొన్నవారికి, దాతలకు, స్వయంసేవకులకు కార్యక్రమ నిర్వాహకులు అనిల్ పోలిశెట్టి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
ఘనంగా ముగిసిన శ్రీరామనవమి ఉత్సవాలు
► వాడవాడలా వసంతోత్సవాలు రాజంపేట టౌన్: గత తొమ్మిదిరోజుల పాటు ఘనంగా జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. నవమి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 13వ తేదీ పట్టణంలోని అనేక ప్రాంతాల్లో, పలు గ్రామాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణోత్సవం అనంతరం వసంతోత్సవాలు నిర్వహించడం సాంప్రదాయం కావడంతో శుక్రవారం అనేక ప్రాంతాల్లో వసంతోత్స కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సీతారాముల కళ్యాణ ఉత్సవ మూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో వయోబేధం లేకుండా అన్ని వయస్సుల వారు పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు, రంగునీళ్ళు చల్లుకున్నారు. పలు ప్రాంతాల్లో పురుషులతో పాటు మహిళలు కూడా వసంతోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వామివారి ఊరేగింపు వెంబడి యువకులు బ్యాండు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. అలాగే పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. పలువురు కర్రసాము వంటి కార్యక్రమాలను చేసి అబ్బురపరిచారు.