
పోలీసులు అరెస్టు చేసిన వ్యభిచార నిందితులు
భువనేశ్వర్: నగరం శివార్లు హంసపాల్ ప్రాంతంలో సెక్స్ రాకెట్‌ను పోలీసులు గుట్టు రట్టు చేశారు. పోలీసులకు అందిన రహస్య సమాచారం ఆధారంగా శుక్రవారం సాయంత్రం ఆకస్మిక దాడులు చేయడంతో సెక్స్ రాకెట్ ముఠా పట్టుబడింది. ఘటనా స్థలం నుంచి ఒక నిందితుడు పరారు అయ్యాడు. హంసపాల్ మెట్రో సెటలైట్ సిటీ సముదాయంలో ఓ ఇంటిపై దాడి చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో అభ్యంతరకర సామగ్రిని జప్తు చేశారు. వ్యభిచారానికి పాల్పడిన నిందిత యువతులు దేవ్‌గడ్, నయాగడ్ ప్రాంతాలకు చెందిన వారుగా భావిస్తున్నారు. ఈ వ్యవహారం నిర్వహిస్తున్న మహిళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద ముగ్గురు మహిళల వ్యతిరేకంగా కేసుల్ని నమోదు చేసినట్లు బలియంత ఠాణా పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment