తిరుమలలో ఆదివారం రాత్రి ఓ గంట పాటు భారీ వర్షంకురిసింది.
తిరుమల: తిరుమలలో ఆదివారం రాత్రి ఓ గంట పాటు భారీ వర్షంకురిసింది. రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు కురిసిన వర్షంతో శ్రీవారి ఆలయం ముందు భాగంలోకి భారీగా నీరు చేరింది. టీటీడీ సిబ్బంది రంగంలోకి దిగి మెషిన్లతో నీటిని తొలగించారు.
షాపింగ్ కాంప్లెక్స్‌లోని దుకాణాల్లోకి నీరు చేరడంతో వ్యాపారులు నీటిని తొలగించుకోవడానికి అవస్థలు పడ్డారు. భక్తులు క్యూలైన్‌లలోనే వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, కాలిబాట దర్శనానికి 8 గంటలు సమయం పడుతోంది.