కడప అర్బన్ : జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని, దాని వల్ల మంచి కెరీర్‌ను పోగొట్టు కోవాల్సి ఉంటుందని జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ శనివారం అన్నారు. విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసిన విషయాలిలా ఉన్నాయి. పోలీసు అధికారులు శాస్త్రసాంకేతిక పరంగా అప్‌డేట్ కావాలన్నారు. ఎర్రచందనం అక్రమరవాణా చేసేవారు, మట్కా క్రికెట్ బెట్టింగ్‌లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారితో పోలీసు అధికారులు, సిబ్బంది కుమ్మక్కు అయినట్లు తెలిస్తే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డి (ఆపరేషన్స్) బి. సత్య ఏసుబాబు, డిఎస్పీలు, సిఐలు పాల్గొన్నారు.