ఇక ఫ్యామిలీ బిజినెస్ ప్లాన్ సర్వే
Published Fri, Sep 16 2016 1:19 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
భీమవరం టౌన్ : ఫ్యామిలి బిజినెస్ ప్లాన్ పేరిట స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)లోని ప్రతి సభ్యురాలి కుటుంబ వివరాల సేకరణ సర్వేను శుక్రవారం నుంచి చేపట్టనున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో సర్వే చేయనున్నారు. జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థ, ఏడు మునిసిపాలిటీలు, ఒక నగర పంచాయతీ పరిధిలో ఎంపిక చేసిన స్లమ్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీలు) సర్వే చేయనున్నారు. ఈ మేరకు రెండు రోజుల శిక్షణ గురువారం ముగిసింది. భీమవరం మునిసిపల్ కార్యాలయంలో జిల్లా రిసోర్స్‌పర్సన్లు టి.మేరి (పాల కొల్లు), కిన్నెర (ఏలూరు) ఆధ్వర్యంలో ఇక్కడ సీఆర్పీలకు శిక్షణ ఇచ్చారు.
సేకరించే వివరాలు
l స్వయం సహాయక సంఘం (ఎస్‌హెచ్‌జీ) పేరు
l ఎస్‌హెచ్‌జీ కోడ్, మునిసిపాలిటీ పేరు
l సభ్యురాలి పేరు
l కుటుంబ సభ్యుల పేర్లు
l వారి మధ్య సంబంధం
l వృత్తి/ వ్యాపారం
l నైపుణ్యం
l మొత్తం కుటుంబ నెల ఆదాయం
l కుటుంబపరమైన ఖర్చులు (నెల వారీగా గృహ ఉపకరణాలు, చదువు, వైద్యం, ఆరోగ్యం, ఇతరాలు)
l కుటుంబపరమైన ఖర్చులు పోను మిగిలే నికర ఆదాయం
l వృత్తి/వ్యాపారం నెలకు టర్నోవర్
l వ్యాపార పరమైన ఖర్చులు (ముడిసరుకు, అద్దె, విద్యుత్ మొదలైనవి)
l టర్నోవర్, వ్యాపారపరమైన ఖర్చులు పోను మిగిలే వ్యాపార ఆదాయం నెలకు
l వ్యాపార సామర్థ్యం మేరకు అవసరమైన పెట్టుబడి
l సభ్యురాలి ప్రస్తుత పెట్టుబడి
l వ్యాపారం లేదా వృత్తిలో జత కలపాల్సిన పెట్టుబడి ఎంత అవసరం
l వ్యాపార సామర్థ్యం మేర పెట్టుబడి తర్వాత టర్నోవర్
l వ్యాపార ఖర్చులు
l ఆదాయం
పట్టణంలో 16,910 మంది సభ్యులు
భీమవరంలో 1,691 స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటిలో 16,910 మంది సభ్యులున్నారు. సర్వేలో సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని జిల్లా మెప్మా పీడీ జి.శ్రీనివాసరావు ఆదేశించారని పట్టణ ప్రాజెక్ట్ ఆఫీసర్ కె.సుబ్బారాయుడు తెలిపారు.
Advertisement
Advertisement