ఒక్క మంత్రి వద్దా స్పష్టమైన సమాచారంలేదు: మండిపడిన బాబు | Chandrababu Naidu serious in Ministers and Officials meeting | Sakshi
Sakshi News home page

ఒక్క మంత్రి వద్దా స్పష్టమైన సమాచారంలేదు: మండిపడిన బాబు

Published Wed, Nov 19 2014 8:44 PM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

హైదరాబాద్: శాఖల వారీగా ఏ ఒక్క మంత్రి  వద్ద స్పష్టమైన సమాచారంలేదని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమావేశం ముగిసింది. మంత్రులు, అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలో రెండు రోజులు మంత్రులు, అధికారులు ఫీల్డ్కు వెళ్లాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ఉన్నతాధికారుల బదిలీలపై సమావేశంలో చర్చించారు. అధికారుల బదిలీలలో అక్రమాలు జరిగినట్లు సమాచారం అందుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ విషయంలో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల బదిలీల ఫైళ్లను తన పరిశీలనకు పంపాలని మంత్రులను, అధికారులను ఆదేశించారు. బదిలీలపై వందకు పైగా ఫిర్యాదులు అందినట్లు సీఎంఓ అధికారులు సమావేశంలో తెలిపారు.

బదిలీల వ్యవహరంలో తాజా పరిణామాలపై మంత్రులు షాక్కు గురయ్యారు. చంద్రబాబు వైఖరిపై ప్రస్తుత ఉన్నతాధికారుల బదిలీలలో సందిగ్ధత నెలకొంది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement