transfers affair
-
తహసీల్దారు.. పైరవీ జోరు !
సాక్షి, నిర్మల్ : రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం తహసీల్దార్ల బదిలీలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారిని సొంత జిల్లాలకు బదిలీ చేసింది. జిల్లాకు చెందిన తహసీల్దార్లు కూడా మళ్లీ సొంత జిల్లాకు రానున్నారు. జిల్లా కలెక్టర్లు సోమవారం తహసీల్దార్లకు మండలాల వారీగా పోస్టింగులు ఇవ్వాల్సిందిగా స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, భూపరిపాలన శాఖ చీఫ్ కమిషన్ సోమేశ్‌కుమార్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో జిల్లాలో ఎవరికి ఏ మండలం ఇస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవం ఉన్నవాళ్లే కనుక ఏ మండలం ఎలా ఉంటుంది.. ఎక్కడ చేస్తే బాగుంటుందన్న విషయాలపై అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉండే మండలాల్లో పోస్టింగ్ ఇప్పించుకునేందుకు పలువురు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మళ్లీ పాత జిల్లాకు.. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు మూడునెలల ముందు తహసీల్దార్ల బదిలీలను చేపట్టారు. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారిని ఇతర జిల్లా లకు బదిలీ చేశారు. ఈక్రమంలో జిల్లాకు చెంది న తహసీల్దార్లలోనర్సయ్య, కలీం, నారాయణ, సుభాష్‌చందర్, తుకారాంను జగిత్యాల జిల్లాకు పంపించారు. జి.లక్ష్మి, నరేందర్, సంతోష్‌రెడ్డి, శంకర్, రాజ్‌మోహన్, కిరణ్మయి,పి.నర్సయ్యను మంచిర్యాల జిల్లాకు బదిలీ చేశారు. శ్యాంసుందర్‌ను కరీంనగర్, లోకేశ్వర్‌రావును ఆదిలాబాద్, జి.శ్రీకాంత్‌ను పెద్దపల్లి, పి.వెంకటరమణను వరంగల్ అర్బన్ జిల్లాకు బదిలీ చేశారు. ప్రస్తుత ఆదేశాలతో వారు మళ్లీ నిర్మల్ జిల్లాకు రానున్నారు. ఇక ఎన్నికల సమయంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో తహసీల్దార్లు మన జిల్లాకు వచ్చారు. ఇందులో అతిఖుద్దీన్, ప్రభాకర్, మహేంద్రనాథ్, మోతీరాం, పవన్‌చంద్ర, శివరాజ్, శ్రీదేవి, సంధ్యారాణి, మోహన్‌సింగ్, చంద్రశేఖర్ ఉన్నారు. అలాగే సత్యనారాయణ, రాజేశ్, రాజేందర్ జగిత్యాల జిల్లా నుంచి రాగా, సుధాకర్, అనుపమరావు, వెంకటలక్ష్మి, ఉమాశంకర్ పెద్దపల్లి జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. బదిలీ కోసం ఎదురుచూసి.. ఎన్నికలు పూర్తయి నెలలు గడుస్తున్నా.. తమను సొంత జిల్లాలకు బదిలీ చేయడం లేదన్న ఆందోళన చాలామంది తహసీల్దార్లలో కనిపించింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికలు కూడా రానుండటంతో ఇక ఆ ఎన్నికలు కూడా పూర్తయ్యే వరకు ఉండాల్సి వస్తుందేమోనని భావించారు. కానీ.. ప్రస్తుత పరిస్థితులు ఎన్నికలకు అనుకూలంగా కనిపించకపోవడం, తాజాగా రెవెన్యూ అధికారులపై జరిగిన దాడులు, శాఖ చేసిన ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం బదిలీలను చేపట్టినట్లు చెబుతున్నారు. అబ్ధుల్పూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యోదంతం తర్వాత రెవెన్యూ అధికారులు చేసిన ఆందోళన రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైంది. పనులన్నీ పక్కనపెట్టి వారు చేసిన నిరసన చివరకు బదిలీలకు మార్గం సుగమం చేసినట్లు భావిస్తున్నారు. అనుకూలమైన చోటు కోసం.. జిల్లాకు బదిలీ అయిన తర్వాత ఇక్కడ ఏ మండలానికి వెళ్తారో.. అనేదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. జిల్లాలోని పలు మండలాలపై రెవెన్యూ అధికారులు ఆసక్తి చూపుతున్నట్లు చెబుతుంటారు. ప్రధానంగా నిర్మల్ అర్బన్, నిర్మల్‌రూరల్, ఖానాపూర్, భైంసా తదితర మండలాలను ఎక్కువమంది కోరుకుంటారన్నది రెవెన్యూ వర్గాలు చెబుతున్న మాట. ఆదాయ వనరులతో పాటు అనుకూలమైన వాతావరణం ఉన్న మండలాన్ని చాలామంది తహసీల్దార్లు ఆశిస్తున్నారు. ఈనేపథ్యం లో జిల్లాలోని పలు స్థానాలకు పోటీ నెలకొన్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు తహసీల్దార్లు అనుకూలమైన మండలం కోసం భారీ ఎత్తున పైరవీలు సైతం మొదలుపెట్టినట్లు సమాచారం. కొంతమంది ఇప్పటికే హైదరాబాద్ వెళ్లి ‘పెద్ద’లను కలిసినట్లు వినిపిస్తోంది. ప్రధాన పోస్టు కావడంతో.. జిల్లాకు కలెక్టర్ ఎలాగో.. మండలానికి తహసీల్దార్ అదే స్థాయి అధికారి. ఒక్క రెవెన్యూ మాత్రమే కాకుండా చాలా పనుల్లో, విషయాల్లో మండలానికి తహసీల్దారే బాధ్యుడు. మండలస్థాయిలో ప్రాధాన్యతతో పాటు దానికి తగ్గట్లు ప్రయోజనాలు ఉండటంతో ఆ పోస్టుకు డిమాండ్ పెరిగింది. అందులోనూ అనుకూలమైన చోటు ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ పని చేసుకోవడంతో పాటు సంబంధిత ప్రయోజనాలనూ పొందే అవకాశాలు ఉంటాయి. ఈనేపథ్యంలోనే జిల్లాలో తమకు ప్రయోజనకరంగా ఉండే చోటు కోసం పెద్దఎత్తున్న ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
‘రెవెన్యూ’లో బదిలీలలు
జిల్లా కేంద్రంలోని ఓ తహసీల్ కార్యాలయంలో పని చేస్తున్న ఆర్ఐ విధుల నిర్వహణ చేపట్టి రెండేళ్లు పూర్తయ్యింది. బదిలీ అనివార్యమని తెలవడంతో పావులు కదిపాడు. తనకున్న పరిచయంతో తహసీల్దార్‌తో కలెక్టర్ పరిపాలనా కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేయించి ప్రస్తుతమున్న చోటే ఆర్ఐని కొనసాగించాలని, బదిలీ చేయవద్దని ఫోన్ చేయించాడు. ఈ విషయం ప్రస్తుతం బయటకు పొక్కడంతో రెవెన్యూ వర్గాల్లో చర్చగా మారింది. బదిలీల జాబితాలో ఉన్న ఈ ఒక్క ఆర్ఐయే కాదు... మరి కొందరు కూడా ఆశిస్తున్న ప్రాంతాలకు వెళ్లడానికి పైరవీలు చేసినట్లు విశ్వనీయ సమాచారం. సాక్షి, ఇందూరు(నిజామాబాద్): రెవెన్యూ శాఖలో త్వరలో భారీగా ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి. ఎక్కువ కాలం ఒకే చోట పని చేస్తున్న వారికి స్థాన చలనం కల్పించడానికి జిల్లా కలెక్టర్ పరిపాలనా కార్యాలయం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆయా మండల తహసీల్ కార్యాలయాల్లో రెండు సంవత్సరాల పాటు పని చేస్తున్న వారిని గుర్తించి వారి బదిలీలకు రెవెన్యూ ఉన్నతాధికారులు ఫైలును రూపొందించారు. దాదాపు 16 మందికి పైగా ఆర్ఐలను ప్రస్తుతం పని చేస్తున్న స్థానాల నుంచి వేరే మండలాలకు బదిలీ చేయడానికి మండలాలు కూడా ఖరారు కాగా, అప్రూవల్ కోసం సంబంధిత ఫైలు జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లింది. అయితే సీసీఎల్ఏను మరోసారి సంప్రదించి ఫైలును నివేదించాలని కలెక్టర్ పరిపాలనా అధికారులకు సూచించారు. కలెక్టర్ సంతకమే తరువాయి కావడంతో మరో వారం రోజుల్లో బదిలీల ఉత్తర్వులు వెలుబడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బదిలీల ఫైలు రూపుదిద్దుకుంటున్న సందర్భంలోనే పలువురు ఆర్ఐలు పావులు కదిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆశిస్తున్న మండలాలకు బదిలీ అయ్యేందుకు ఉన్నతాధికారుల సిఫార్సులు చేయించారని, మరి కొందరు పని చేస్తున్న స్థానంలోనే మరికొన్ని రోజులు కొనసాగేందుకు తమదైన రీతిలో పైరవీలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆర్ఐల ఫైలు కలెక్టర్ వద్ద నిలిచిపోవడంతో కాస్త నిరాశకు గురయ్యారు. ఆశించిన మండలాలు రాకపోతే ఎలా అని అంతర్మథనంలో పడ్డారు. డిప్యూటీ తహసీల్దార్ల బదిలీలు... ఆర్ఐల బదిలీల పక్రియ పూర్తి కాగానే డిప్యూటీ తహసీల్దార్ బదిలీలు కూడా చేపట్టాలని కలెక్టర్ పరిపాలనా అధికారులు భావిస్తున్నారు. ఇందుకు జిలాల్లో ఎక్కువ కాలం అంటే రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు ఒకేచోట పని చేస్తున్న వారి వివరాలను సేకరించడానికి కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 20 మంది వరకు డిప్యూటీ తహసీల్దార్లు బదిలీలకు అర్హులుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ఐల బదిలీలు కాగానే తమ బదిలీలే ఉంటాయని తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్లు కూడా ఆశిస్తున్న ప్రాంతాల్లో పోస్టింగ్‌ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తమకున్న బలంతో పావులు కదుపుతున్నట్లు సమాచారం. -
ఒక్క మంత్రి వద్దా స్పష్టమైన సమాచారంలేదు: మండిపడిన బాబు
హైదరాబాద్: శాఖల వారీగా ఏ ఒక్క మంత్రి వద్ద స్పష్టమైన సమాచారంలేదని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమావేశం ముగిసింది. మంత్రులు, అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలో రెండు రోజులు మంత్రులు, అధికారులు ఫీల్డ్‌కు వెళ్లాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారుల బదిలీలపై సమావేశంలో చర్చించారు. అధికారుల బదిలీలలో అక్రమాలు జరిగినట్లు సమాచారం అందుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ విషయంలో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల బదిలీల ఫైళ్లను తన పరిశీలనకు పంపాలని మంత్రులను, అధికారులను ఆదేశించారు. బదిలీలపై వందకు పైగా ఫిర్యాదులు అందినట్లు సీఎంఓ అధికారులు సమావేశంలో తెలిపారు. బదిలీల వ్యవహరంలో తాజా పరిణామాలపై మంత్రులు షాక్‌కు గురయ్యారు. చంద్రబాబు వైఖరిపై ప్రస్తుత ఉన్నతాధికారుల బదిలీలలో సందిగ్ధత నెలకొంది. ** -
మహిళలే బెస్ట్ : మంత్రులకు చంద్రబాబు క్లాస్!
హైదరాబాద్: మంత్రులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. కొంతమంది సీనియర్ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అధికారుల బదిలీల వ్యవహారంపై ఆయన సీరియస్ అయ్యారు. చంద్రబాబు ఈరోజు టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రులతో మాట్లాడారు. అవినీతి ఆరోపణలు చాలా ఎక్కువగా వస్తున్నాయి, జాగ్రత్తగా వ్యవహరించడని వారిని హెచ్చరించారు. బదిలీల విషయంలో రచ్చకెక్కడం సమంజసం కాదని హితవు పలికారు. ఈ విషయంలో పరువు తీస్తున్నారని ఆగ్రహించారు. బదిలీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించమని సలహా ఇచ్చారు. మహిళా మంత్రులే బెటరని చంద్రబాబు కితాబిచ్చారు. మహిళా, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతను ప్రశంసించారు. కొంతమంది మంత్రులు సీఎం కార్యాలయం జోక్యంపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ** -
పోలీసుల్లో అయోమయం!q
సాక్షి, గుంటూరు బదిలీలపై పోలీసు శాఖలో అయోమయం కొనసాగుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వందరోజులు పూర్తయినా బదిలీల వ్యవహారం కొలిక్కిరాకపోవడంతో అధికారులు గందరగోళానికి గురవుతున్నారు. కావల్సిన చోట పోస్టింగ్ సాధించేందుకు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. టీడీపీ ప్రజా ప్రతినిధులు తమ పరిధిలోని స్టేషన్లకు రావల్సిన అధికారుల జాబితాను పోలీస్ ఉన్నతాధికారులకు ఇప్పటికే ఇచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ బదిలీల ప్రక్రియ ఆలస్యం కావడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోలీస్ ఉన్నతాధికారులు మాత్రం సీఐలు, ఎస్సైల పనితీరు, వారికొచ్చిన రివార్డులు-అవార్డులతోపాటు వారిపై ఉన్న ఆరోపణల వివరాలతో కూడిన జాబితాను సిద్ధం చేసినట్టు తెలిసింది. అధికార పార్టీ నేతలు ఇచ్చిన జాబితాలనే ఖరారు చేసే పక్షంలో ఇంత జాప్యం ఎందుకు జరుగుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ముందు డీఎస్పీల పోస్టింగ్‌లు పూర్తి చేశాక సీఐలు, ఎస్సైల పోస్టింగ్‌లపై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తారని భావిస్తున్నారు. అయితే ఇవేమీ పట్టని కొందరు అధికారులు మాత్రం టీడీపీ ప్రజా ప్రతినిధులు, నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకు అవకాశం కల్పిస్తే మీరు చెప్పినట్టే చేస్తామంటూ వారిముందు సాగిలపడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు రేంజి పరిధిలో సీఐల జాబితాను ఇప్పటికే సిద్ధం చేయగా.. డీజీపీ కొన్ని మార్పులను సూచించారని, ఈ మేరకు కొత్త జాబితాను రూపొందించడంలో జిల్లా అధికారులు నిమగ్నమైనారని తెలిసింది. విధులను పక్కనబెట్టి పైరవీలు కొందరు అధికారులు విధి నిర్వహణను పక్కనబెట్టి మరీ టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్నారని.. దీనివల్ల శాంతిభద్రతలు క్షీణించే పరిస్థితి నెలకొందని పోలీసు వర్గాలే చెబుతున్నారుు. ఎలాగైనా బదిలీ తప్పదని, ఈలోగా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని భావిస్తున్న అధికారులు, సిబ్బంది ఎలాంటి పనికైనా వెనుకాడడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. సొమ్ము కోసం కొన్ని కేసులను బలవంతంగా రాజీ చేరుుస్తున్నారని సమాచారం. ఇలాంటి అక్రమాల నిరోధానికి చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సిబ్బంది అందికాడికి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ వారంరోజుల్లో బదిలీల పర్వం ప్రారంభం కానుందని సమాచారం. కొత్త అధికారులు వచ్చేవరకు సమస్యలు తప్పవని ప్రజలు నిట్టూరుస్తున్నారు.