అంతర్జాతీయ సదస్సుకు మహిళా వర్సిటీ అధ్యాపకులు
తిరుపతి సిటీ: థాయిలాండ్‌లోని ప్రిన్స్ ఆఫ్ సొంజ్కలా యూనివర్సిటీ వేదికగా గురువారం నుంచి రెండురోజుల పాటు జరగనున్న రీజనల్ నెట్‌వర్క్స్ ఆన్ పావర్టీ ఎరాడికేషన్ అనే అంతర్జాతీయ సదస్సుకు మహిళా వర్సిటీ అధ్యాపకులు హాజరుకానున్నారు. 14దేశాలకు చెందిన వర్సిటీ అధ్యాపకులు హాజరుకాన్ను ఈ సదస్సుకు మహిళా వర్సిటీ నుంచి రిజిస్టార్ ప్రొఫెసర్ ఎన్ రజిని, డీన్ ఆర్ ఉషా, ప్రొఫెసర్ జ్యోత్న్స పాల్గొంటారని వర్సిటీ అధికారులు తెలిపారు.
నేటి నుంచి ఒన్ హెల్త్ రాష్ట్రస్థాయి సదస్సు
తిరుపతి కల్చరల్: ఐఏపీఎస్‌ఎం, ఐపీహెచ్‌ఏ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీ గురువారం నుంచి మూడు రోజుల పాటు ఎస్వీ మెడికల్ కళాశాలలోని ఆడిటోరియంలో ప్రపంచ వ్యాప్తంగా మనిíÙతో పాటు మనిషి చుట్టూ ఉన్న వాతావరణం, జంతువుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఒన్ హెల్త్ అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు సామాజిక వైద్య విభాగాధిపతి సునీత తెలిపారు.
ఈ నెల 31 ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళా
చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు జిల్లా కేంద్రంలో ఉన్న ఉపాధి కార్యాలయంలో ఈ నెల 31 న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఉపాధి అధికారిణి పద్మజ తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలన్నారు. 31 వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించే ఉద్యోగ మేళాలో టయోటా, హోండా కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు సంబంధిత దృవీకరణపత్రాలతో ఉద్యోగ మేళాలో పాల్గొనాలని తెలిపారు.
జాబ్‌డ్రైవ్‌లో పలువురికి ఉద్యోగాలు
వైవీయూ: కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో బుధవారం నిర్వహించిన జాబ్‌డ్రైవ్‌లో పలువురు విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి. రవీంద్రనాథ్ తెలిపారు. కళాశాల జేకేసీ, హెటిరోల్యాబ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ డ్రైవ్‌లో 26 మంది అభ్యర్థులు పాల్గొనగా, 16 మంది అభ్యర్థులు జూనియర్ కెమిస్ట్ ఉద్యోగానికి ఎంపికైనట్లు తెలిపారు.
తెలుగు భాషను కాపాడుకుందాం
మనుబోలు (వెంకటాచలం): తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వీసీ విజయ్‌భాస్కర్‌రావు అన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని కాకుటూరు వద్దనున్న వర్సిటీలోని తిక్కన సాహితీ పీఠం నెల్లూరు తెలుగు శాఖ ఆధ్వర్యంలో బుధవారం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా పిలువబడే తెలుగు భాష గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులరి్పంచారు.
Comments
Please login to add a commentAdd a comment