ఆలూరు(గట్టు), న్యూస్‌లైన్: పొలానికి వెళ్లిన ఓ రైతు చీకటి పడే వేళ ఇంటికి తిరి గి వస్తున్న క్రమంలో దారుణ హత్యకు గు రయ్యాడు. ఈ సంఘటన గట్టు మండలంలోని ఆలూరులో చోటు చేసుకుంది. గ్రా మస్తులు, పోలీసుల కథనం ప్రకారం... ఆలూరుకు చెందిన రైతు గుడిసె తిమ్మప్ప(48)ను గుర్తు తెలియని వ్యక్తులు దారి కా చి, గొంతు కోసి కాలువ పక్కనే ఉన్న ము ళ్లపొదల్లో జనసంచా రం లేని చోట గుంత తీసి పాతిపెట్టారు.
గురువారం సాయంత్రం పొలం దగ్గరకు వెళ్లిన తిమ్మప్ప శుక్రవారం ఉదయం వరకు ఇంటి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పొలాలు, కాలువ గట్టులో వెతకగా, హత్య చేసి పాతిపెట్టిన విషయాన్ని గుర్తించారు. వెంటనే గట్టు ఎస్‌ఐ మట్టంరాజుకు సమాచారం అందించగా సిబ్బం దితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గద్వాల డీఎస్పీ గోవిందరెడ్డి, సీఐ షాకీర్ హుసేన్, తహశీల్దార్ సైదులు సంఘట నాస్థలాన్ని పరిశీలిచి తహశీల్దార్ సమక్షం లో శవాన్ని బయటకు తీయించారు.
మనువరాలి పాల కోసం వెళ్లి......
గురువారం తిమ్మప్ప కర్నూలులో చదువుతున్న తన కుమారుడు రాఘవేంద్ర (7వ తరగతి)ను స్కూల్‌లో వదిలి గ్రామానికి తిరిగివచ్చాడు. అనంతరం ఇంటి దగ్గరు న్న మనువరాలి పాల కోసం సాయంత్రం తుమ్మల చెరువు శివారులో ఉన్న పొలాని కి వెళ్లి పాలు తీసుకుని బైక్‌పై ఇంటికి తిరు గు ప్రయాణమయ్యాడు. అయితే రాత్రి 9 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలం వద్ద ఉన్నవారికి ఫోన్ చేసి ఆరా తీయగా, పాలు తీసుకుని సాయంత్రమే తిరిగి వెళ్లినట్లు చెప్పారు.
తె ల్లారినా తిమ్మప్ప తిరిగి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ స భ్యులు పొలాలు, కాలువ గట్లవెంట గా లించగా, ర్యాలంపాడు రిజర్వాయర్‌లోకి వెళ్లే కాలువ గట్టున ముళ్ల పొదల మధ్య గొయ్యి తీసిన విషయాన్ని గుర్తించారు. దీంతో పోలీస్‌లకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకు ని తహశీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుని తలపై బలమైన గాయంతో పాటు గొంతు కోసి న ఆనవాళ్లు, ఎడమ దవడపై కత్తిగాట్లు ఉన్నాయి. సంఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు గద్వాల సీఐ షాకీర్ హుస్సేన్ తెలిపారు. కాగా హ తుడు తిమ్మప్ప ఇటీవల తుమ్మల చెరువు శివారులో పొలాన్ని కొనుగోలు చేశాడు. అయితే పొలాన్ని అమ్మిన వ్యక్తి సోదరులు పొలం కొనుగోలును వ్యతిరేకించినట్లు సమాచారం. దీనికితోడు మృతుడు 2009 లో జరిగిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితునిగా ఉన్నాడు.
కృష్ణమోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి
తిమ్మప్ప హత్యకు సంబంధించి వైఎ స్సార్ సీపీ నేత కృష్ణమోహన్‌రెడ్డి దిగ్భ్రాం తిని వ్యక్తం చేశారు. నిందిలును గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రైతు దారుణహత్య
Published Sat, Sep 21 2013 3:58 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
Advertisement
Advertisement