విద్యా సమాచారం | Educational information | Sakshi
Sakshi News home page

విద్యా సమాచారం

Aug 28 2024 10:25 AM | Updated on Aug 28 2024 10:25 AM

Educational information

రేపు ఉద్యోగ మేళా 
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో గురువారం జేకేసీ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం.శ్రీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ ట్రెయినీ కెమిస్ట్‌గా శ్రీకాళహస్తి, సూళ్లూరుపేటలో పనిచేసేందుకు పురుషులు, తిరుపతి యంగ్‌ ఇండియా శాఖలో పనిచేసేందుకు 21–32 ఏళ్ల మధ్య వయసు గల స్త్రీ, పురుష అభ్యర్థులు, టీసీఎల్‌లో పనిచేసేందుకు 21–32 వయసు గల స్త్రీ, పురుష అభ్యర్థులు కావాలన్నారు. విద్యార్హత 10 నుంచి డిగ్రీ చదివి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు గురువారం ఉదయం 10గంటలకు విద్యార్హత ద్రువపత్రాల జిరాక్సు కాపీలు, ఆధార్‌ కార్డు, రెండు ఫోటోలతో హాజరు కావాలన్నారు.   

శ్రీ పద్మావతిలో ఎంబీబీఎస్‌ అడ్మిషన్లు ప్రారంభం 
తిరుపతి తుడా: స్విమ్స్‌ శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల లో  ఎంబిబిఎస్‌ 2024 –25 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. తొలిరోజు ఆరుగురు విద్యార్థు­లు ప్రవేశాలు పొందారు. స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌ వి కుమార్‌ చేతులమీదుగా వీరు అడ్మిషన్‌ ప­త్రా­లను అందుకున్నారు. స్విమ్స్‌ డైరెక్టర్‌ మాట్లా­డుతూ 26వ తేదీ నుంచి ఆల్‌ ఇండియా కోట అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని  వెల్లడించారు.  

30న ఎస్వీయూలో జాబ్‌ మేళా 
తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో ఈనెల 30న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయాధికారి టి శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఏదేని డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు శుక్రవారం ఉదయం 10గంటలకు ఎస్వీయూ ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో జరిగే జాబ్‌మేళాకు హాజరుకావాలని కోరారు. మూడు ఎమ్‌ఎన్‌సీ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 9533889902, 7989810194 నంబర్ల నందు సంప్రదించాలని సూచించారు. 

రాష్ట్ర స్థాయి వక్తృత్వ పోటీలకు ఎంపిక 
ఉప్పలగుప్తం: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలానికి చెందిన భీమనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు వారధి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇంగ్లిష్‌ వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పోటీల్లో శిరంగు శృతి, కుంపట్ల చాతుర్య ప్రథమ స్థానంలో నిలిచారు. వారు వచ్చే నెల సెప్టెంబర్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.  

గొల్లపాలెం పాఠశాలకు మూడోసారి ప్రతిభా పురస్కారం 
కాజులూరు: స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ, క్రీడా ప్రతిభా పురస్కారానికి కాకినాడ జిల్లా గొల్లపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల మరోసారి ఎంపికైనట్టు పీడీ జి.సునీల్‌కుమార్‌ తెలిపారు. గతేడాది స్కూల్‌ గేమ్స్‌లో తమ పాఠశాల నుంచి రాష్ట్ర స్థాయిలో 40 మంది, జాతీయ స్థాయిలో ఇద్దరు క్రీడాకారులు మెరిట్‌లో రాణించినందుకు ఈ పురస్కారం వచి్చందన్నారు. గత మూడేళ్లుగా తమ పాఠశాల వరుసగా అవార్డు సాధిస్తుందన్నారు.  

యోగా శిక్షకుల నియామకానికి దరఖాస్తుల ఆహా్వనం 
రంగంపేట: హోమియో ఆసుపత్రిలో యోగా శిక్షకుల నియామకానికి దరఖాస్తులు ఆహా్వనిస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు ప్రభుత్వ హోమియో ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ కె.విద్యాసాగర్‌ మంగళవారం తెలిపారు. యోగాలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ లేదా డిప్లమా చేసి అనుభవం ఉన్న వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 83282 75475 నంబరులో సంప్రదించాలన్నారు. 

స్పౌజ్‌ కేటగిరీకీ కొత్త భాష్యం చెబుతున్న విద్యాశాఖ 
గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉపాధ్యాయ సర్దుబాటు ప్రక్రియలో విద్యాశాఖ రోజుకో కొత్త నిబంధన పేరుతో ఉపాధ్యాయులను గందరగోళానికి గురి చేయడం తగదని ఎస్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఏఐఎస్టీఎఫ్‌ ఆరి్థక కార్యదర్శి సీహెచ్‌ జోసఫ్‌ సు«దీర్‌బాబు మంగళవారం ఓప్రకటనలో తెలిపారు. డివిజన్‌స్థాయిలో నిర్వహించనున్న సర్దుబాటు కౌన్సెలింగ్‌ నిర్వహణపై మంగళవారం విద్యాశాఖ డైరెక్టర్‌ నిర్వహించిన వెబ్‌ ఎక్స్‌లో భాగంగా స్పౌజ్‌ కేటగిరీపై కొత్త నిబంధనలు విధించడం తగదన్నారు.  

పారా మెడికల్‌ కోర్సుల్లో అడ్మిషన్‌కు కౌన్సిలింగ్‌  
గుంటూరు మెడికల్‌: గుంటూరు మెడికల్‌ కళాశాలలో పారా మెడికల్‌ కోర్సుల్లో అడ్మిషన్‌లకు మంగళవారం వైద్య కళాశాల అధికారులు కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు ఎలాట్‌ చేశారు. వైద్య కళాశాలలో డీఎంఎల్టీ, ఎనస్థీషియా టెక్నీషియన్, ఈసీజీ టెక్నీíÙయన్, కార్డియాలజి 

టెక్నీషియన్, తదితర కోర్సుల్లో చేరేందుకు 
గత నెల 30న దరఖాస్తులకు ఆహా్వనిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. సుమారు వంద సీట్ల కోసం 600 మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి మెరిట్‌ ఆధారంగా సీట్లు కేటాయించారు.  

ఏయూలో గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకానికి చర్యలు 
విశాఖ సిటీ: ఆంధ్రా యూనివర్శిటీలోని అన్ని విభాగాల్లో బోధన పటిష్టతకు అవసరమైన గెస్ట్‌ ఫ్యాకల్టీలను నియమించుకోడానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్స్‌కు ఏయూ వీసీ ఆచార్య జి.శశిభూషణరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. టీచింగ్‌ కొరత లేకుండా చూస్తామని, ఎక్కడా కూడా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ఆపిన గెస్ట్‌ ఫ్యాకలీ్టలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement