తిరుమలలో ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఉచిత గదులు భక్తులకు సులభంగా లభిస్తున్నాయి.
తిరుపతి:తిరుమలలో భక్తల రద్దీ పెరిగింది. ప్రస్తుతం 29 కంపార్టమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరు స్వామివారిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పట్టనుంది. ఇదిలా ఉండగా కాలినడక భక్తులకు ఎనిమిది గంటల సమయం, ప్రత్యేక దర్శన భక్తులకు రెండు గంటల సమయం పట్టనుంది. ఆదివారం స్వామి వారిని తొంభై వేలకు మందికి పైగా దర్శించుకున్నారు.
ఆదివారం సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం ప్రకారం..
గదుల వివరాలు: ఉచిత గదులు - 85 రూ.50 గదులు- 18 ఖాళీగాఉన్నాయి. రూ.100 గదులు-రూ.500 గదులు-ఖాళీగా లేవు
ఆర్జితసేవా టికెట్ల వివరాలు
ఆర్జిత బ్రహ్మోత్సవం - సహస్ర దీపాలంకరణ సేవ - వసంతోత్సవం- ఖాళీగా లేదు
సోమవారం ప్రత్యేక సేవ - విశేషపూజ