చెన్నై : దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం చర్చనీయాంశమైంది. ఈ వివాదంపై తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిని అందించే తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ సంస్థ స్పందించింది.
‘‘ఏఆర్ డెయిరీ నుండి జూన్, జూలైలో నెయ్యి సరఫరా చేశాం. ఇప్పుడు మా సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చెయ్యడం లేదు. 25 సంవత్సరాలుగా మేం డైయిరీ సేవల్ని అందిస్తున్నాం. దేశ వ్యాప్తంగా మా ఉత్పత్తుల అమ్మకాలు నిర్వహిస్తున్నాం. ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు రాలేదు.
తాజాగా, మా సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మేం.. టీటీడీకి అందించే నెయ్యి నాణ్యతా ప్రమాణాలపై టెస్ట్‌లు నిర్వహించాం. ఆ టెస్టుల్లో నేయ్యిలో ఎలాంటి లోపాలు లేవని తేలింది. కానీ మాపై విష ప్రచారం చేస్తున్నారు. టీటీడీ అడిగిన వెంటనే సంబంధిత రిపోర్ట్‌ను పంపించాం. కానీ టీటీడీ నుంచి మాకు స్పందన రాలేదు’’ అని ఏఆర్ డెయిరీ యాజమాన్యం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment