విద్యా కమిషన్‌కు సలహా కమిటీ | Advisory Committee to Education Commission | Sakshi
Sakshi News home page

విద్యా కమిషన్‌కు సలహా కమిటీ

Published Sun, Oct 20 2024 5:17 AM | Last Updated on Sun, Oct 20 2024 5:17 AM

Advisory Committee to Education Commission

ఆరుగురిని నియమించిన ప్రభుత్వం 

రాష్ట్రంలో విద్యావ్యవస్థ బలోపేతానికి సూచనలు ఇవ్వనున్న కమిటీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విద్యా కమిషన్‌కు ఆరు­గు­రితో సలహా కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు ఇ­చ్చింది. ప్రొఫెసర్‌ హరగో­పాల్, కాకతీయ యూనివ­ర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్లు కె.మురళీ మోహన్, కె.వెంకట నారాయణ, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత, ఎంవీఎఫ్‌ ఫౌండేషన్‌ కన్వీనర్‌ ఆర్‌.వెంకటరెడ్డి, యూనిసెఫ్‌ విద్యా నిపుణుడు కె.ఎం.శేషగిరి ఈ కమిటీలో ఉన్నారు. 

విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యారంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల కమిషన్‌ సభ్యులను కూడా నియమించింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత ఉన్నతస్థాయికి చేర్చడానికి వీలుగా ఈ సలహా కమిటీ కమిషన్‌కు సూచనలు చేస్తుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement