సోమవారం ఉస్మానియా వర్సిటీ పరిధిలో జరిగే పరీక్షలు వాయిదా
3న జరిగే పరీక్షలు యథాతథం
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. పరిస్థితిని బట్టి ఆ తర్వాత తగిన నిర్ణయాన్ని తీసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో వాస్తవ పరిస్థితిని డీఈవోలు పలు జిల్లాల్లో కలెక్టర్లకు వివరించారు. పిల్లలు పాఠశాలలకు వచ్చే పరిస్థితి లేదని, పాఠశాలల ప్రాంగణాలు వరద నీటితో నిండిపోయాయని, కొన్ని పాఠశాల భవనాలు కురుస్తున్నాయని, ఇక శిథిలావస్థలో ఉన్న భవనాల్లో తరగతులు నిర్వహించలేని పరిస్థితి ఉందని తెలిపారు.
పలు చోట్ల వాగులు పొంగుతున్నాయని, రహదారుల్లో వెళ్లలేని పరిస్థితి ఉందని డీఈవోలు తమ నివేదికల్లో పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఇంకా వర్షాలు కురిస్తే మంగళవారం స్కూళ్లు తెరవాలా? లేదా? అనేది ఆలోచిస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో సోమవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విశ్వవిద్యాలయం అధికారులు ప్రకటించారు. 3వ తేదీన జరగాల్సిన పలు పరీక్షలు యథావిధిగా ఉంటాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment