
అఖిల్ రాజ్, అనన్య నాగళ్ల జంటగా సూర్య అల్లంకొండ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. శ్రీ దుర్గ క్రియేషన్స్ పతాకంపై జి. ప్రతాప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు విజయ్ కనకమేడల పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. తొలి సన్నివేశానికి నటుడు దగ్గుపాటి అభిరామ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు, దర్శకుడు కాశీ విశ్వనాధ్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.
‘‘పూర్తి ప్రేమకథా చిత్రమిది. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, రెండు షెడ్యూల్స్‌లో పూర్తి చేస్తాం’’ అన్నారు సూర్య అల్లంకొండ. ‘‘మంచి లవ్ సబ్జెక్ట్‌తో వస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు జి. ప్రతాప్ రెడ్డి. ‘‘యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు అఖిల్ రాజ్, అనన్య నాగళ్ల. సినిమాటోగ్రాఫర్ వీఆర్‌కే నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ పీఆర్ మాట్లాడారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నవీన్ బి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్.
Comments
Please login to add a commentAdd a comment