బిగ్‌బాస్ నాల్గో సీజన్లో మొన్నటివరకు అవినాష్‌కు పులిహోర రాజా అనే బిరుదుండేది. కానీ అతడు వెళ్లిపోతూ ఆ బిరుదు తనకన్నా అఖిల్‌కు పర్ఫెక్ట్గా సెట్టవుతుందని చెప్పాడు. ఒక్కసారి కెమెరాలు ఆఫ్ చేస్తే అతడు పెద్ద బేసిన్ తీసుకుని మరీ కలుపుతాడని పేర్కొన్నాడు. దీంతో అఖిల్‌కు కూడా పులిహోర రాజా అనే బిరుదు వచ్చేసింది. అయితే అఖిల్.. మోనాల్ దగ్గర మాత్రమే అలాంటి వేషాలు వేస్తాడని అభిమానులు అతడిని వెనకేసుకువచ్చారు. కానీ నిన్నటి ఎపిసోడ్, నేటి అన్‌సీన్ వీడియోలో ఆ భ్రమలు పటాపంచలయ్యాయి.
ఎవ్వరినీ వదలట్లేదుగా
నిన్నటి 'అధికారం' టాస్కులో సోహైల్ హారికను ముద్దుపెట్టుకున్నాడని అఖిల్ హర్టయ్యాడు. నాకు కూడా ముద్దివ్వాల్సిందేనని హారికను బతిమిలాడాడు. ఆమె ఎంత చెప్పినా వినకపోవడంతో ఇస్తావా? ఇవ్వవా? అని బెదిరించాడు. దీంతో ఇదెక్కడి గొడవరా అనుకున్న హారిక టాస్క్ అయ్యాక ఇస్తానని చెప్పి ఆ క్షణానికి తప్పించుకుంది. ఇక్కడ అఖిల్ ప్రవర్తన ఆయన అభిమానులకు కూడా నచ్చలేదు. మరోవైపు అన్‌సీన్ వీడియోలో అరియానా, హారికతో పులిహోర కలుపుతూనే ఉన్నాడు. 'అవినాష్ లేడు కాబట్టి నీతో ఇంకా క్లోజ్ కావచ్చు. ఎలాంటి సాయం కావాలన్నా నన్ను అడుగు' అంటూ అరియానాతో ప్రేమగా మాట్లాడాడు. చిటికేస్తే నీ ముందుంటా అని ఆమె దగ్గర తల వంచగానే షాకైన అరియానా నీకు అంతా బాగానే ఉంది కదా! అని అడిగింది.
నీకు పడిపోతున్నా..
దీంతో అఖిల్ మరో అడుగు ముందుకేసి నువ్వు అలా చూడకు, నేను ఇంకా పడిపోతున్నానని ఫ్లర్ట్ చేశాడు. మనం బ్రేక్‌ఫాస్ట్ డేట్‌కు వెళ్దాం అంటూ ఆమెను ప్రేయసిలా ఫీలయ్యాడు. ఇదంతా పద్నాలుగో వారం ఎఫెక్ట్ కదా అని అరియానా అడగ్గానే తన మీద ఎప్పటి నుంచో ఇష్టం ఉందన్న విషయాన్ని అఖిల్ బయటపెట్టాడు. మన మెంటాలిటీ కలవడం వల్ల ఇలాంటి పర్సన్ కావాలనిపిస్తుంది, కానీ నువ్వు బయట ఎవరో ఉన్నావని చెప్పావు కాబట్టి ఇంతకన్నా ఎక్కువ ముందుకెళ్లను అని క్లారిటీ ఇచ్చాడు. ఒకవేళ నీకు బయట ఎవరూ లేకపోతే హ్యాపీ, ఉంటే మాత్రం హర్ట్ అవుతాను అని పులిహోర ఓ రేంజ్లో కలిపాడు. (ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే అఖిలే విన్నర్!)
అరియానాతో హగ్లో ఏదో తేడా ఉంది
అటు కిచెన్‌లో పని చేస్తున్న హారికను అఖిల్ వెనక నుంచి హత్తుకున్నాడు. పని తప్పించుకోవడానికే ఇవన్నీ చేస్తున్నావు అని హారిక చెప్పింది. ఆ తర్వాత వచ్చిన అరియానాను కూడా హత్తుకున్నాడు. ఇదంతా చూస్తున్న మోనాల్ ఇదేం బాగోలేదని చెప్పింది. హారికను హగ్ చేసుకోవడం ఓకే కానీ అరియానాను హత్తుకోవడం నాకు వేరేలా అనిపిస్తోందని అభిప్రాయపడింది. ఒకవేళ మోనాల్‌ను ఉడికించేందుకే అఖిల్ ఇలా చేసినా చూసే జనాలకు మాత్రం అది నీచంగా కనిపిస్తోంది. (పొగిడాననుకున్నావా, అదంతా తూచ్)
తన గోతి తనే తవ్వుకుంటున్న అఖిల్
ఏదేమైనా టికెట్ టు ఫినాలే తర్వాత అఖిల్ పూర్తిగా మారిపోయాడని జనాలు అంటున్నారు. మరీ ఇంత పులిహోర కలుపుతూ. ముద్దుల కోసం అడుక్కునే దిగజారుడు పనులు ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదని ఆయన అభిమానులు తలలు బాదుకుంటున్నారు. మోనాల్‌ను వదిలేసి మిగతా ఇద్దరమ్మాయిల వెంటపడటం అస్సలు బాగోలేదని చెప్తున్నారు. ఇది తనలోని మరో యాంగిల్ అని అఖిలే ఒప్పుకున్నాడు. కానీ ఇది అతనికే చేటు తెచ్చేలా కనిపిస్తోంది. ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో ఈ పులిహోర వ్యవహారాలతో ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. ఈ విషయం అఖిల్ ఎప్పుడు తెలుసుకుంటాడో!
Comments
Please login to add a commentAdd a comment