Director Surender Reddy Tested Covid Positive - Sakshi
Sakshi News home page

Surendar Reddy: డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డికి కరోనా.. షూటింగ్‌కి బ్రేక్‌

Published Sat, Nov 20 2021 11:24 AM | Last Updated on Sat, Nov 20 2021 11:44 AM

Surendar Reddy Tested Positive for Corona virus - Sakshi

Surendar Reddy Tested Positive for Corona virus: ప్రముఖ దర్శకుడు సురేందర్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. షూటింగ్‌ కోసం హంగేరి వెళ్లి వచ్చిన ఆయన ఇటీవలె కరోనా బారిన పడ్డారు. సురేందర్‌ రెడ్డితో పాటు ఆయన కుటుంబానికి కూడా కోవిడ్‌ పాజిటివ్‌ అని నిర్థారణ అయినట్లు సమచారం. ప్రస్తుతం వారంతా క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. కాగా ప్రస్తుతం సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్‌ సినిమా తెరకెక్కుతునున్న సంగతి తెలిసిందే.

అఖిల్‌ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, సురేందర్ సినిమా సంయుక్త సమర్పణలో ఈ చిత్రం​ రూపొందుతుంది. ఇటీవలె హంగేరిలో కొన్ని ముఖ్యమైన యాక్షన్‌ సీన్స్‌ను చిత్రీకరించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌ సినిమాపై మాంచి హైప్‌ను క్రియేట్‌ చేసింది. సురేందర్‌ రెడ్డి కోలుకున్న అనంతరం తిరిగి షూటింగ్‌ ప్రారంభం కానుంది. 

చదవండి: సీక్రెట్‌గా వీడియో రికార్డ్‌.. ఫోన్‌ లాక్కున్న స్టార్‌ హీరో
బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement