
తొలిరోజు కలెక్షన్స్ అదుర్స్!
షాహిద్ కపూర్, అలియా భట్ జంటగా దర్శకుడు వికాస్ భల్ తీసిన తాజా చిత్రం 'షాన్‌దార్'. ఈ సినిమాకు వచ్చిన 'రివ్యూ'ల సంగతి ఎలా ఉన్నా.. మొదటిరోజు కలెక్షన్స్ మాత్రం భారీగా వచ్చాయి. తొలిరోజు ఈ సినిమా రూ. 11 కోట్లు వసూలు చేసింది. షాహిద్ కెరీర్‌లోనే తొలిరోజు అత్యధిక కలెక్షన్ ఇది.
దసరా రోజున ఈ విడుదలైన ఈ సినిమా ఈ వీకెండ్‌లో చెప్పుకోదగిన కలెక్షన్స్ సాధించినట్టు భావిస్తున్నారు. అయితే వీకెండ్ ట్రేడ్ రిపోర్టు రావాల్సి ఉంది. వెడ్డింగ్ ఆర్గనైజర్ జాగిందర్ జోగిందర్‌గా షాహిద్ కపూర్, వధువు సోదరిగా అలియ భట్ నటించిన ఈ సినిమాపై విమర్శకులు, సినీ సమీక్షులు పెదవి విరిచారు. ఈ సినిమాకు క్రిటిక్స్ పెద్దగా రేటింగ్ ఇవ్వలేదు.