Shaandaar
-
తొలిరోజు కలెక్షన్స్ అదుర్స్!
షాహిద్ కపూర్, అలియా భట్ జంటగా దర్శకుడు వికాస్ భల్ తీసిన తాజా చిత్రం 'షాన్‌దార్'. ఈ సినిమాకు వచ్చిన 'రివ్యూ'ల సంగతి ఎలా ఉన్నా.. మొదటిరోజు కలెక్షన్స్ మాత్రం భారీగా వచ్చాయి. తొలిరోజు ఈ సినిమా రూ. 11 కోట్లు వసూలు చేసింది. షాహిద్ కెరీర్లోనే తొలిరోజు అత్యధిక కలెక్షన్ ఇది. దసరా రోజున ఈ విడుదలైన ఈ సినిమా ఈ వీకెండ్లో చెప్పుకోదగిన కలెక్షన్స్ సాధించినట్టు భావిస్తున్నారు. అయితే వీకెండ్ ట్రేడ్ రిపోర్టు రావాల్సి ఉంది. వెడ్డింగ్ ఆర్గనైజర్ జాగిందర్ జోగిందర్గా షాహిద్ కపూర్, వధువు సోదరిగా అలియ భట్ నటించిన ఈ సినిమాపై విమర్శకులు, సినీ సమీక్షులు పెదవి విరిచారు. ఈ సినిమాకు క్రిటిక్స్ పెద్దగా రేటింగ్ ఇవ్వలేదు. -
అలియా స్టూడెంట్‌గా జాయిన్ అవుతా: అమితాబ్
ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ సెలబ్రిటీలు నవ్వుల పూయిస్తున్నారు. అభిమానులతో ఇంటరాక్షన్ కోసం సోషల్ వెబ్సైట్లలో యాక్టివ్‌గా ఉంటున్న టాప్ స్టార్స్, అప్పుడప్పుడు ఇంట్రస్టింగ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తున్నారు. హీరోయిన్ అలియా భట్ పోస్ట్‌కు బిగ్‌బీ అమితాబ్ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అలియా భట్ అవకాశం వస్తే తనకు డ్యాన్సర్‌గా లేదా యాక్టింగ్ టీచర్‌గా మారాలని ఉందని పోస్ట్ చేసింది.. అయితే ఈ పోస్ట్ పై బిగ్ బి.. నేను నీ హంబుల్ స్టూడెంట్ అంటూ రిప్లై ఇచ్చారు. వెంటనే స్పందించిన అలియా యాక్టింగ్ ఇనిస్టిట్యూషనే... స్టూడెంట్‌గా మారుతానంటున్నారా అంటూ అమితాబ్ పట్ల తన గౌరవాన్ని తెలియజేసింది. ప్రస్తుతం అలియా.. షాహిద్ కపూర్‌తో కలిసి 'షాందార్' సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా ఆమె చాలా యాక్టివ్ పాల్గొంటుంది. ప్రజెంట్ ఈ ట్విటర్ కామెంట్స్ కూడా మూవీ ప్రమోషన్‌కు ప్లస్ అవుతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.