
ఆకాంక్ష రంజన్ కపూర్ ప్రముఖ మోడల్ అయినప్పటికీ ఆమె.. అలియా భట్ స్నేహితురాలిగానే అందరికీ సుపరిచితం. టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌కు ఈ మోడల్‌కు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని గతంలో పుకార్లు వచ్చాయి. ఇక ఆకాంక్ష ఏప్రిల్ 25న రాహుల్, అతియా శెట్టితో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ఇది మరిన్ని ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చింది. పైగా ‘ఈ ప్రేమతో నేనెంతో సంతోషంగా ఉన్నాను’ అంటూ క్యాప్షన్ జత చేసింది. దీంతో రాహుల్ ఆ ఊహాగానాలు నిజమని ఒప్పుకోలేక, కాదని కొట్టిపారేయలేక అవస్థ పడుతున్నారు.
ఓ ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ ‘ఈ విషయాల గురించి మీడియా ఏం రాసిందో నాకు తెలియదు. ఎందుకంటే నేను పెద్దగా పేపర్లు చదవను. కాబట్టి నా గురించి ఏం రాశారనేది నాకు తెలీదు. అయినా నా వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడానికే ఇష్టపడుతాను. దాని గురించి పబ్లిక్‌లో మాట్లాడటం ఇష్టముండదు’ అంటూ అసలు విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. పైగా ‘నాకైతే ఏం తెలీదు. తెలిసినపుడు మీకు తప్పకుండా చెప్తా’నని తెలివిగా సమాధానమిచ్చి తప్పించుకున్నాడు. గతంలో నిధి అగర్వాల్, అథియా శెట్టిలతో రాహుల్ డేటింగ్ చేసినట్లు వచ్చిన వార్తలను ఖండించిన విషయం తెలిసిందే. అయితే తాజా ప్రేమ వ్యవహారంపై నోరు మెదపటానికి కూడా అతడు ఎందుకు ఇష్టపడట్లేదో!
Comments
Please login to add a commentAdd a comment