'వెడ్డింగ్ పులావ్' మూవీ రివ్యూ | wedding Pullav Movie Review | Sakshi
Sakshi News home page

'వెడ్డింగ్ పులావ్' మూవీ రివ్యూ

Oct 16 2015 1:47 PM | Updated on Sep 3 2017 11:04 AM

'వెడ్డింగ్ పులావ్' మూవీ రివ్యూ

'వెడ్డింగ్ పులావ్' మూవీ రివ్యూ

అంతాకొత్త వారితో తెరకెక్కిన బాలీవుడ్ లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ వెడ్డింగ్ పులావ్. వినోద్ ప్రధాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ పెళ్లి చుట్టూ తిరుగుతుంది. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ ప్రచారం...

టైటిల్: వెడ్డింగ్ పులావ్
జానర్: రొమాంటిక్ కామెడీ
తారాగణం: అనుష్క రంజన్, దిగాంత్, సోనాలి సెహగల్, కరణ్ గ్రోవర్, రిషీ కపూర్.
దర్శకత్వం: వినోద్ ప్రధాన్
నిర్మాత: శశీ రంజన్, అను రంజన్

అంతా కొత్తవారితో తెరకెక్కిన బాలీవుడ్ లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ వెడ్డింగ్ పులావ్. వినోద్ ప్రధాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ పెళ్లి చుట్టూ తిరుగుతుంది. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ ప్రచారంతో కాస్త హైప్ క్రియేట్ చేసిన వెడ్డింగ్ పులావ్ ఆడియన్స్ ను ఎంత వరకు మెప్పించిందో చూద్దాం.

కథ :
అనుష్క అలియాస్ లంబు (అనుష్క రంజన్), ఆదిత్య (దిగంత్) లు మంచి స్నేహితులు. ఎంతో  స్నేహంగా ఉండే ఈ ఇద్దరు చాలా రోజుల తర్వాత తాము ప్రేమలో ఉన్నట్టు గుర్తిస్తారు. అయితే ఆ సమయానికి ఇద్దరికీ వేర్వేరుగా పెళ్లిళ్లు కుదురుతాయి. అనుష్కకు జై( కరణ్ గ్రోవర్)తో, ఆదిత్యకు రియా( సొనాలి సెహగల్)తో నిశ్చితార్థం అయిపోతుంది. ఆ తరువాత ఈ ఇద్దరు ప్రేమికులు ఏం చేశారు, తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారనేదే మిగతా కథ.

విశ్లేషణ :
కుచ్ కుచ్ హోతా హై లాంటి ఎన్నో బాలీవుడ్ సినిమాలు తెరకెక్కిన అదే పాత ఫార్ములాతో ఈ సినిమాను తెరకెక్కించారు. పంజాబీ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో కాస్త ఫ్రెండ్ షిప్, ఇంకాస్త లవ్ స్టోరీ కలిపి సినిమాటిక్ గా చూపించారు. సినిమాలో ఒక్క రిషి కపూర్ తప్ప మిగతా అంతా కొత్తవారు కావటంతో నటీనటుల గురించి పెద్దగా చెప్పుకోవటానికి ఏమీ లేదు. ముఖ్యంగా లవ్ సీన్స్ పండించటంలో కొత్త తారలు ఫెయిల్ అయ్యారు.


ప్లస్ పాయింట్స్ :

రిషి కపూర్ క్యారెక్టర్
లొకేషన్స్

మైనస్ పాయింట్స్ :


హీరో హీరోయిన్ల పర్ఫామెన్స్
రొటీన్ కథ, కథనం

ఓవరాల్గా 'వెడ్డింగ్ పులావ్' ఏ సెక్షన్ ఆడియన్స్కు కూడా టేస్టీగా అనిపించటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement