
ఆ హీరోతో నో ప్రాబ్లమ్: నటి
ముంబయి: బాలీవుడ్ నటి జాక్వెలైన్ ఫెర్నాండేజ్ చేసిన వ్యాఖ్యలు నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాకు సంతోషాన్నిస్తాయి. కానీ అతడి ప్రేయసి అలియా భట్‌కు మాత్రం చాలా కోసం తెప్పించే ఉంటాయి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శ్రీలంక భామ జాక్వెలైన్ మాట్లాడుతూ.. 'నా కో స్టార్స్‌లలో సిద్ధార్థ్ మల్హోత్రాతో చాలా ఈజీగా కలిసిపోతాను. అతడితో నటించడమంటే కష్టమనిపించదు. అతడు చాలా ఎనర్జీతో నటిస్తాడు. అందుకే ఇతర హీరోలతో పోల్చితే సిద్ధార్థ్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చాలా ఈజీగా ఉంటుందని' ఆమె పేర్కొన్నారు.
జాక్వెలైన్ కామెంట్లపై హర్షం వ్యక్తం చేస్తూ ఆమె చెప్పిన విషయం నిజమేనన్నాడు సిద్ధార్థ్. మా ఇద్దరి ఆన్‌స్క్రీన్ రొమాన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎంతో బిజీ షెడ్యూలున్నా తనలాగే జాక్వెలైన్ ఎంతో ఎనర్జీతో పనిచేస్తుందని, కష్టించేతత్వం ఆమె సొంతమని కితాబిచ్చాడు. మరోవైపు తన ప్రియుడు సిద్ధార్థ్‌తో జాక్వెలైన్ క్లోజ్‌గా ఉండటంపై అలియా సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ కారణంతోనే ఆ మధ్య ప్రియుడిపై అలిగిన అలియా.. తమ వెకేషన్‌ను రద్దు చేసినట్లు బీటౌన్‌లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వీరు ఒకరిపై మరొకరు ఈ తరహాలో ప్రశంసలు కురిపిస్తుంటే అలియా ఎలా స్పందిస్తారన్నది హాట్ టాపిక్‌గా మారింది. సిద్ధార్థ్ మల్హోత్రా, జాక్వెలైన్‌లు కలిసి నటించిన లేటెస్ట్ మూవీ 'ఏ జెంటిల్మన్'. ఆగస్టు 25న ఈ మూవీ విడుదల కానుంది.