ఆలియా ‘ఆల్ఫా’లో అతిథిగా స్టార్‌ హీరో! | Hrithik Roshan To Play Guest Role In Alpha Movie Latest Updates | Sakshi
Sakshi News home page

ఆలియా ‘ఆల్ఫా’లో అతిథిగా స్టార్‌ హీరో!

Published Sun, Sep 1 2024 4:11 PM | Last Updated on Sun, Sep 1 2024 5:35 PM

Alpha Movie Latest Updates

ఆలియా భట్, శార్వరీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పై యాక్షన్‌ ఫిల్మ్‌ ‘ఆల్ఫా’. శివ్‌ రవైల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వైఆర్‌ఎఫ్‌ (యశ్‌ రాజ్‌ ఫిలింస్‌) స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ మూవీని ఆదిత్యా చో్ప్రా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కశ్మీర్‌లో జరుగుతోంది. ఆలియా, శార్వరీ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 

ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని బాలీవుడ్‌ సమాచారం. అంతేకాదు... ఈ సినిమాలో హృతిక్‌ రోషన్‌ ఓ అతిథి పాత్ర చేయనున్నారని, ఆయన పాత్ర తాలూకు సన్నివేశాల చిత్రీకరణను కూడా ఈ షూటింగ్‌ షెడ్యూల్‌లోనే ప్లాన్‌ చేశారని బాలీవుడ్‌ టాక్‌. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement