alpha
-
ఆలియా ‘ఆల్ఫా’లో అతిథిగా స్టార్ హీరో!
ఆలియా భట్, శార్వరీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పై యాక్షన్ ఫిల్మ్ ‘ఆల్ఫా’. శివ్ రవైల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వైఆర్ఎఫ్ (యశ్ రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ మూవీని ఆదిత్యా చో్ప్రా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కశ్మీర్లో జరుగుతోంది. ఆలియా, శార్వరీ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. అంతేకాదు... ఈ సినిమాలో హృతిక్ రోషన్ ఓ అతిథి పాత్ర చేయనున్నారని, ఆయన పాత్ర తాలూకు సన్నివేశాల చిత్రీకరణను కూడా ఈ షూటింగ్ షెడ్యూల్లోనే ప్లాన్ చేశారని బాలీవుడ్ టాక్. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
పఠాన్, టైగర్ టీమ్ లోకి ఆలియా భట్.
-
Alpha: స్పై యూనివర్స్‌లోకి వచ్చేస్తోన్న ‘ఆల్ఫా’ గర్ల్స్
‘వైఆర్ఎఫ్’ (యశ్ రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న మరో హిందీ చిత్రం ‘ఆల్ఫా’. ఆలియా భట్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో శార్వరి మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ‘ది రైల్వేమెన్’ ఫేమ్ శివ్ రవైల్ దర్శకత్వంలో ఆదిత్యా చో్ప్రా నిర్మిస్తున్నారు. శుక్రవారం ‘ఆల్ఫా’ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘‘నిశితంగా గమనిస్తే ప్రతి నగరంలోనూ ఓ అడవి ఉంటుంది. ఆ అడవిని ఏలేది మనమే’’ అంటూ ఆలియా భట్ చెప్పే డైలాగ్ ఈ చిత్రం అనౌన్స్మెంట్ టీజర్లో ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయా లనుకుంటున్నారు. -
సరికొత్త అధ్యాయం?!
మరో అడుగు ముందుకు పడింది. ఈశాన్య భారతంలో దీర్ఘకాలంగా సాగుతున్న సమస్యకు పరిష్కారం కనుక్కొనే ప్రయత్నంలో ఒక అభిలషణీయ పరిణామం గత వారం సంభవించింది. అస్సామ్‌లోని పేరుబడ్డ తీవ్రవాద సంస్థ ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సామ్’ (అల్ఫా)లోని ఒక వర్గం హింసామార్గం విడిచిపెట్టి, ప్రజాస్వామ్య పంథాలోకి రానున్నట్టు డిసెంబర్ 29న ప్రకటించింది. అల్ఫా వర్గానికీ, కేంద్ర, అస్సామ్ సర్కార్లకూ మధ్య ఈ తాజా త్రైపాక్షిక పరిష్కార ఒప్పందం (ఎంఓఎస్) స్వాగతించాల్సిన విషయం. ఈశాన్యంలో శాంతి స్థాపన నిమిత్తం కుదుర్చుకుంటూ వచ్చిన ఒప్పందాల వరుసలో ఇది తాజాది. చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజనీ, దీంతో అస్సామ్‌లో హింసాకాండకు పూర్తిగా తెర పడుతుందనీ కేంద్ర హోమ్ మంత్రి అమితమైన ఆశాభావం ప్రకటించారు. అయితే, ఇప్పటి దాకా కుదుర్చుకున్న అనేక ఒప్పందాల ఫలితాలు మిశ్రమంగానే మిగిలాయి. అందుకే, ఈ కొత్త ఒప్పందం కూడా కేవలం మరో పత్రంగా మిగులుతుందా? లేక శాంతిసాధనలో చరిత్రాత్మకం కాగలుగుతుందా అన్నది పలువురి అనుమానం. ‘సార్వభౌమాధికార’ అస్సామ్ను కోరుతూ 1979లో ‘అల్ఫా’ సాయుధ పోరాటం ప్రారంభించింది. అలా 44 ఏళ్ళుగా రగులుతున్న కుంపటిని తాజా ఒప్పందం చల్లారుస్తుందని ఆశ. 1985లో అస్సామ్ ఒప్పందం తర్వాత కూడా అక్కడి గ్రామీణ ప్రజల్లో అసంతృప్తిని రగిలించడంలో అల్ఫా సఫలమైంది. కిడ్నాపింగ్‌లు, దోపిడీలు, హత్యలు, బాంబు పేలుళ్ళతో ఒక దశలో అల్ఫా అట్టుడికించింది. దాంతో, ప్రభుత్వం 1990లో అల్ఫాను నిషేధించింది. కర్కశమైన ‘సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం’ (ఏఎఫ్ఎస్పీఏ)ను తీసుకురావాల్సి వచ్చింది. ‘అల్ఫా’ ఉచ్చదశలో వెలిగిపోతున్న రోజుల్లో దాని చేతులు అస్సామ్ మొదలు దక్షిణాసియా దాకా విస్తరించాయి. మయన్మార్, భూటాన్ లలో అల్ఫా శిబిరాలు, బంగ్లాదేశ్‌లో ఆ సంస్థ నేతలు, శ్రీలంక– పాకిస్తాన్లలో శిక్షకులున్న రోజులవి. అయితే, పరిస్థితులు మారాయి. శ్రీలంకలో ఎల్టీటీఈ పతనం, భూటాన్ గడ్డపై శిబిరాల్ని మూయించాల్సిందిగా ఆ దేశంపై ఒత్తిడి రావడం, అలాగే భారత్‌తో మైత్రి పాటించే షేక్ హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక శక్తులను సహించక పోవడం, అల్ఫాలోని వర్గపోరు, భారత సర్కార్ ఉక్కుపాదం మోపడం... ఇవన్నీ కొన్నేళ్ళుగా అల్ఫాను బలహీనపరిచాయి. వలస కార్మికులనూ, సామాన్య నిరుపేదలనూ లక్ష్యంగా చేసుకొని సాగించిన హింస సైతం రైతాంగంలో అల్ఫా పలుకుబడిని పలుచన చేసింది. నిజానికి, గతంలో పలు సందర్భాల్లో అల్ఫాతో శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఆ మాటకొస్తే శాంతిప్రక్రియ 2009లోనే మొదలైంది. చర్చల అను కూల వర్గంతో 2011లోనే సంప్రతింపులు ఆరంభమయ్యాయి. సంస్థ బలహీనమయ్యేసరికి సార్వ భౌమాధికార డిమాండ్‌ను అల్ఫా పక్కనబెట్టక తప్పలేదు. స్థానిక ప్రజల ప్రయోజనాల పరిరక్షణ చాలనే విధంగా వ్యవహరించి, గౌరవప్రదంగా బయటపడేందుకు ప్రయత్నించింది. వెరసి, పుష్కర కాలం తర్వాత చర్చలు ఫలించాయి. పరిష్కార ఒప్పందం కుదిరింది. అయితే, అల్ఫా సంస్థాపకుల్లో ఒకరైన అప్పటి ‘కమాండర్–ఇన్–ఛీఫ్’ పరేశ్ బారువా శాంతి చర్చలను వ్యతిరేకిస్తూ 2012లోనే ‘అల్ఫా ఇండిపెండెంట్’ (అల్ఫా–ఐ)గా వేరుకుంపటి పెట్టుకున్నారు. అరబింద రాజ్‌ఖోవా సారథ్యంలోని వర్గమే తప్ప సైద్ధాంతికంగా కరడుగట్టిన ఈ ‘అల్ఫా–ఐ’ వర్గం ఒప్పందంలో భాగం కాలేదు. అది ఒక లోటే. అలాగని, కుదిరిన ఒప్పందాన్ని తీసిపారేయలేం. వేర్పాటువాదం ప్రబలడంతో ఒకప్పుడు గణనీయంగా నష్టపోయిన రాష్ట్రం తాజా ఒప్పందంతో మళ్ళీ అభివృద్ధి పథంలో పయనించ గలుగుతుంది. కేంద్ర ఆర్థిక సహాయంతో అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతమవుతాయి. ఈ ఒప్పందం పుణ్యమా అని ఈ ఈశాన్య రాష్ట్రంలో సాంఘిక – సాంస్కృతిక అశాంతికి కూడా తెరపడుతుందని మరో ఆశ. ఎందుకంటే, అక్రమ వలసల మొదలు స్థానిక తెగల వారికి భూ హక్కుల వరకు పలు అంశాల పరిష్కారం గురించి తాజా త్రైపాక్షిక ఒప్పందం ప్రస్తావిస్తోంది. ఆ ఆశ నెరవేరితే అంతకన్నా కావాల్సింది లేదు. నిజానికి, అస్సామ్‌లో చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలకై ‘ఏఎఫ్ఎస్పీఏ’ కింద సాయుధ బలగాలకు అపరిమితమైన అధికారాలను ప్రభుత్వం ఎన్నడో కట్టబెట్టింది. అల్ఫా దూకుడు మునుపటితో పోలిస్తే తగ్గడం, అలాగే అనేక విమర్శల అనంతరం గత రెండేళ్ళలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆ చట్టాన్ని ఉపసంహరించారు. ఇప్పుడిక మిగతా ప్రాంతాల్లో సైతం ఈ అమానవీయ చట్టాన్ని ఎత్తివేసే దిశగా అస్సామ్ సర్కార్ అడుగులు వేయాలి. తాజా ఒప్పందంతో తీవ్రవాదానికి పూర్తిగా తెర పడిందని తొందరపడడానికి లేదు. అతివాద ‘అల్ఫా–ఐ’ వర్గం నేత బారువా ఇప్పటికీ చైనా–మయన్మార్ సరిహద్దులో గుర్తుతెలియని చోట దాగున్నారు. కొన్నేళ్ళుగా కొత్త చేరికలు లేక ఆయన వర్గం గణనీయంగా బలహీనపడినప్పటికీ, ఆ వర్గపు వ్యవహారం ఇంకా తేలనందున కేంద్ర, అస్సామ్ ప్రభుత్వాలు ఆచితూచి అడుగేయాల్సి ఉంది. కాక పోతే... ఒకపక్క రష్యా – ఉక్రెయిన్లు, మరోపక్క గాజాలో ఇజ్రాయెల్ – పాలస్తీనాల మధ్య యుద్ధా లతో రోజూ వార్తలను వేడెక్కించిన గడచిన 2023 ఎట్టకేలకు ఒక శాంతి ఒప్పందంతో ముగియడం ఒకింత ఊరట. ఒప్పందాన్ని సఫలం చేయడం ప్రభుత్వ, అల్ఫా వర్గాల ముందున్న సవాలు. అల్ఫా మాట అటుంచి, దీర్ఘకాల వేర్పాటువాదం అనంతరం ఈశాన్యంలో సుస్థిరంగా శాంతి వెల్లివిరియాలంటే ప్రభుత్వం ముందుగా అక్కడి ప్రతి పౌరుడూ జనజీవన స్రవంతిలో భాగమయ్యేలా చూడాలి. రైతాంగ జీవనప్రమాణాల్ని మెరుగుపరచాలి. వేర్పాటువాదం వైపు ఆకర్షితులు కాకుండా జాగ్రత్త పడాలి. అందుకీ ఒప్పందం దోహదపడితేనే ఇన్నేళ్ళ సంప్రతింపుల శ్రమకు అర్థం, పరమార్థం! -
మూడు రష్యా సంస్థలకు ఎఫ్‌పీఐ లైసెన్సులు
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన మూడు సంస్థలకు భారతీయ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్‌పీఐ) లైసెన్సును జారీ చేసింది. మాస్కో కేంద్రంగా పనిచేసే ఆల్ఫా క్యాపిటల్ మేనేజ్మెంట్ కంపెనీతో పాటు విసెవిలోద్ రోజానోవ్ అనే ఇన్వెస్టరు ఈ లైసెన్సులను పొందిన జాబితాలో ఉన్నారు. మూడేళ్ల పాటు 2026 వరకు ఇది వర్తిస్తుంది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై ఆంక్షలు అమలవుతున్న వేళ ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి రష్యా ఇన్వెస్టర్లు ఎఫ్‌పీఐ మార్గాన్ని ఎంచుకోవడం ఇదే ప్రథమం కావచ్చని పరిశమ్ర వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ వారు ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) మార్గంలోనే ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించాయి. డాలరును ఆయుధంగా చేసుకుని రష్యాపై ఆంక్షలను ప్రయోగిస్తుండటమనేది కొత్త ఆర్థిక పరిస్థితులకు దారి తీస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యా తాజా ధోరణి ప్రాధాన్యం సంతరించుకున్నట్లు పేర్కొన్నారు. -
వణికిస్తున్న కరోనా రూపాలు: ఆల్ఫా .. డెల్టా .. తర్వాత!
సాక్షి, హైదరాబాద్: ఆల్ఫా, బీటా, డెల్టా, గామా, కప్పా, ల్యామ్డా.. ఇవి ఇప్పటివరకు ప్రాచుర్యం పొందిన కరోనా రూపాంతరితాలు. వీటిలో డెల్టా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికించే స్థాయికి చేరుకుంది. ఒకవైపు భారత్‌లో మూడోసారి కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదవుతుండగా.. అమెరికాలో కూడా దీని కారణంగా నమోదవుతున్న కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం ఒకే ఒక్క నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డెల్టాను వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్ (వీవోఐ) స్థాయి (జాగురుకతతో వ్యవహరించాల్సిన స్థాయి) నుంచి వేరియంట్ఆఫ్ కన్సర్న్ (వీవోసీ) స్థాయి (ఆందోళన కలిగించే స్థాయి)కి చేర్చేసింది. ఒకరకంగా రెండో ప్రమాద హెచ్చరిక అన్నమాట. అదృష్టవశాత్తూ ఇంతకంటే తీవ్రమైన లక్షణాలు కలిగించే, టీకాలకు లొంగని కొత్త రూపాంతరితమేదీ ఇంతవరకు బయటపడలేదు. కానీ డెల్టా ఒక హెచ్చరిక మాత్రమేనని.. భవిష్యత్తులో మరిన్ని రూపాంతరితాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డెల్టా తొలి మజిలీయే.. ఒకవైపు డెల్టా రూపాంతరితం వేగంగా విస్తరిస్తూంటే, ఇంకోవైపు చాలా దేశాల్లో కోవిడ్ నిబంధనల సడలింపు కూడా అంతే వేగంగా జరిగిపోతోంది. అయితే ఈ విషయంలో మరికొంత జాగురుకతతో వ్యవహరిస్తే మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరిస్తోంది. వైరస్ పరిణామ క్రమంలో డెల్టా తొలి మజిలీ మాత్రమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. కేసులు పెరిగిపోతుండటం, నిబంధనల సడలింపులు, టీకా వేగం తగ్గుతుండటం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సిద్ధం చేసిన మోడలింగ్ ప్రకారం.. ప్రస్తుత పరిస్థితులు కొత్త రూపాంతరితాలు మరిన్ని పుట్టుకొచ్చేందుకు అనువైనవన్నది వీరి తాజా అంచనా. అమెరికాలో ఆరు వారాల వ్యవధిలో డెల్టా కారణంగా వచ్చిన కేసులు పది శాతం నుంచి ఏకంగా 83 శాతానికి పెరిగిపోవడాన్ని ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. టీకాలు వేసుకున్న వారిపైనా.. కోవిడ్ నుంచి రక్షణకు తయారు చేసుకున్న టీకాలు ఇప్పటివరకు మెరుగైన రక్షణ కల్పిస్తున్నప్పటికీ ఇటీవలి కాలంలో కొన్నిచోట్ల టీకాలు వేసుకున్న వారికీ వైరస్ సోకుతుండటం ఎక్కువ అవుతోంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్–వీ, ఫైజర్, మోడెర్నా వంటి పలు కంపెనీలు సిద్ధం చేసిన వ్యాక్సిన్లు డెల్టాను సైతం సమర్థంగా అడ్డుకోగలవని ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలు వెల్లడించాయి. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు వస్తోందంటే.. వైరస్ కొద్దోగొప్పో బలపడుతున్నట్లుగానే పరిగణించాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. భారత్‌లో లక్ష్యానికి దూరంగా.. ఈ ఏడాది చివరికల్లా అర్హులైన దేశ జనాభా మొత్తానికీ వ్యాక్సిన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది జనవరి 16వ తేదీ టీకా కార్యక్రమం మొదలు కాగా ఇప్పటివరకు మొత్తం 47.2 కోట్ల మందికి టీకాలిచ్చారు. ఇందులో రెండు డోసులు పూర్తి చేసుకున్న వారి సంఖ్య కేవలం 10.40 కోట్లు మాత్రమే. అంటే జనాభాలో కోవిడ్ నుంచి పూర్తిస్థాయి రక్షణ పొందిన వారు కేవలం 7.6 శాతం మంది మాత్రమే. జూలై నుంచి మొదలుపెట్టి డిసెంబర్ వరకు టీకాలు బాగా అందుబాటులో ఉంటాయని, రోజుకు కోటిమందికి టీకాలివ్వాలన్న లక్ష్యాన్ని అందుకోగలమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ముందుగా అంచనా వేసినట్లు భారత్ బయోటెక్ తన ఉత్పత్తి లక్ష్యాలను అందుకోలేకపోవడం వల్ల టీకా కార్యక్రమం మందగించిందని, జాతీయ టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న కమిటీ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. చదవండి: థర్డ్‌వేవ్: పిల్లలపై ప్రభావం ఎలా ఉండొచ్చు? ప్రపంచ వ్యాప్తంగానూ ఇంతే.. ప్రపంచవ్యాప్తంగానూ టీకా కార్యక్రమం ఏమంత గొప్పగా సాగడం లేదు. అగ్రరాజ్యం అమెరికాలో సగం జనాభా పూర్తిస్థాయిలో టీకాలు పొందింది. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఇది 35 శాతంగా ఉంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో 60 శాతానికిపైబడి ఉంది. ఈ నేపథ్యంలోనే అవసరమైతే మళ్లీ కోవిడ్ నిబంధనలు విధించాల్సిన పరిస్థితి రావచ్చునన్న హెచ్చరికలు అక్కడ వినపడుతున్నాయి. ఇక పేదదేశాల్లో చాలా తక్కువమంది టీకాలు వేయించుకున్నట్లు తెలుస్తోంది. అయినా.. వారి కంటే 25 రెట్లు తక్కువే ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు తీసుకున్న వారు ఆసుపత్రి పాలయ్యేందుకు, తీవ్రమైన లక్షణాలు ఎదుర్కొనేందుకు ఉన్న అవకాశాలు టీకాలు వేయించుకోని వారి కంటే 25 రెట్లు తక్కువ. అయితే ఈ రక్షణ ఎంతమందికి కల్పించామన్న అంశంపై కొత్త రూపాంతరితాలు పుట్టుకొచ్చే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. జనాభాలో కనీసంఅరవై శాతం మందికి టీకాలిస్తేనే కొత్తవి పుట్టుకొచ్చే అవకాశాలు తగ్గుతాయని సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ఒకటి చెబుతోంది. వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్ వ్యాధి వ్యాప్తి, లక్షణాల తీవ్రత, గుర్తింపు, చికిత్సలకు లొంగకపోవడం వంటి అనేక అంశాలను ప్రభావితం చేయగల జన్యుపరమైన మార్పులు ఉన్న రూపాంతరితాలను వీవోఐలుగా పరిగణిస్తారు. టీకా లేదా గతంలో సోకిన వైరస్ల కారణంగా ఉత్పత్తి అయిన యాంటీబాడీల ప్రభావం కొంచెం తక్కువగా ఉండే రూపాంతరితం. కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగేందుకు కారణమనేందుకు సాక్ష్యాలున్నా ఈ కోవకే చెందుతుంది. వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగవచ్చు. లక్షణాలు తీవ్రంగా ఉండి.. ఆసుపత్రి బారిన పడేవారి సంఖ్య, మరణాలు ఎక్కువవుతాయన్న అంచనాలు ఉన్న రూపాంతరితాలను వీవోసీలుగా పరిగణిస్తారు. టీకా లేదా గతంలో సోకిన వైరస్ల కారణంగా పుట్టిన యాంటీబాడీల ప్రభావం చాలా తక్కువగా ఉన్న రూపాంతరితాలు కూడా ఈ కోవకి చెందుతాయి. వైరస్ నియంత్రణకు ఇస్తున్న చికిత్స తక్కువ ఫలితాలు ఇస్తున్నా.. వైరస్‌ను గుర్తించే పరీక్షలు విఫలమవుతున్నా దాన్ని ప్రమాదకరమైన రూపాంతరితంగా గుర్తిస్తారు. వేరియంట్ ఆఫ్ హై కాన్సీక్వెన్స్ విపరీత పరిణామాలకు తావివ్వగల రూపాంతరితాలను వేరియంట్ ఆఫ్ హై కాన్సీక్వెన్స్ అని పిలుస్తారు. అదృష్టవశాత్తూ కోవిడ్–19 కారక వైరస్లలో ఇప్పటివరకు ఇలాంటిది ఒకటి కూడా లేదు. వేరియంట్ ఆఫ్ కన్సర్న్కు ఉన్న లక్షణాలు అన్నీ ఉండి.. అదనంగా ఆసుపత్రులపై విపరీతమైన భారం మోపగల అవకాశం ఉన్న రూపాంతరితాలు ఈ కోవకు చెందుతాయి. అంతేకాకుండా వైరస్‌ను గుర్తించేందుకు ప్రస్తుతం చేస్తున్న ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు పూర్తిగా విఫలమయ్యే అవకాశం ఉన్నా, టీకా సామర్థ్యం గణనీయంగా తగ్గినా, టీకాలేసుకున్నా ఎక్కువమందికి వ్యాధి సోకినా, టీకా వేసుకున్నా తీవ్రమైన వ్యాధి లక్షణాలు కనిపించినా దాన్ని విపరీత పరిణామాలకు అవకాశమున్న రూపాంతరితంగా గుర్తిస్తారు. ఇలాంటి రూపాంతరితాలను గుర్తిస్తే... ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ విషయాన్ని నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 4 వీవోఐ, 4 వీవోసీ ఏడాదిన్నర కాలంలో కోవిడ్ కొన్ని వేల రూపాల్లోకి మారి ఉంటుంది. వీటిల్లో అత్యధికం పెద్దగా అపాయం లేనివే. ఒకవేళ ప్రమాదం ఉందని అనుకుంటే.. దాని తీవ్రత, లక్షణాలను బట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అన్న రెండు వర్గాలుగా విభజిస్తుంది. తాజాగా అమెరికా ఇంకో అడుగు ముందుకేసి వేరియంట్ ఆఫ్ హై కాన్సీక్వెన్స్ (వీవోహెచ్సీ) (విపరీత పరిణామాలకు కారణమయ్యేది) అని ఇంకో వర్గాన్ని జోడించింది. అయితే తొలి రెండు వర్గాల రూపాంతరితాలకు మాత్రమే గ్రీకు అక్షరమాలలోని అక్షరాలు ఆల్ఫా, బీటా, గామా వంటి పేర్లను కేటాయిస్తారు. తొలిసారి వైరస్‌ను గుర్తించిన దేశం పేరుతో పిలవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయని డబ్ల్యూహెచ్ఓ ఈ ఏర్పాటు చేసింది. గ్రీకు అక్షరమాలలో మొత్తం 24 అక్షరాలు ఉంటే.. ఇప్పటివరకు 11 రూపాంతరితాలకు పేర్లు పెట్టారు. వీటిల్లో నాలుగు వీవోఐ కాగా.. నాలుగు వీవోసీ ఉన్నాయి. ఎప్సిలాన్, జెటా, తీటా పేర్లు కొంత కాలం క్రితం మూడు వేరియంట్లకు కేటాయించినప్పటికీ, ప్రమాదం తక్కువని తరువాత స్పష్టమైంది. ఈ లెక్కన ఇంకో పదమూడు పేర్లు కొత్త రూపాంతరితాలకు పెట్టేందుకు అవకాశం ఉందన్నమాట. పేరు శాస్త్రీయ నామం తొలిసారి గుర్తించింది డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు ఈటా బి.1.525 డిసెంబర్ 2020, పలుదేశాల్లో 17, మార్చి 2021 అయోటా బి.1.526 నవంబర్ 2020, అమెరికాలో 24, మార్చి 2021 కప్పా బి.1.617.1 అక్టోబర్ 2020, భారత్‌లో 04, ఏప్రిల్ 2021 ల్యామ్డా సి.37 డిసెంబర్ 2020, పెరులో 14, జూన్ 2021 -
ఐదుగురిని కాల్చిచంపిన అల్ఫా మిలిటెంట్లు
ఖెరోనిబరి: అస్సాంలో నిషేధిత అల్ఫా(ఇండిపెండెంట్) తీవ్రవాదులు గురువారం రెచ్చిపోయారు. తిన్సుకియా జిల్లాలోని ఖెరోనిలో ఐదుగురు పౌరుల్ని కాల్చిచంపారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులున్నారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. కొందరు సాయుధ అల్ఫా తీవ్రవాదులు గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఖెరోనిలోని ధోలా–సదియా వంతెన వద్దకు చేరుకుని ఐదారుగురు గ్రామస్తుల పేర్లను పిలిచారని తెలిపారు. దీంతో బయటకు వచ్చినవారిపై సమీపం నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపారన్నారు. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు గాయపడ్డారని వెల్లడించారు. మరోవైపు ఈ దాడిని ఖండించిన అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
యాక్షన్ ఎడ్వెంచర్ చిత్రంగా ఆల్ఫా
తమిళసినిమా: సూపర్ యాక్షన్ ఎడ్వెంచర్ చిత్రంగా ఆల్ఫా హాలీవుడ్ చిత్రం భారతీయ సినీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. మానవుడు, జంతువు అనే అసాధారణ స్నేహబంధంతో ఇంతకు ముందు వచ్చిన జంగిల్‌బుక్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే విధంగా అలాంటి మరో కోణంలో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రం ఆల్ఫా. ఇది చారిత్రక యాక్షన్ ఎడ్వెంచర్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందంటున్నారు చిత్ర వర్గాలు. ఇది ఒక యువకుడు, తోడేలు మధ్య మిత్రత్వం, వారు ఎదుర్కొనే సాహసాలు ఇతివృత్తంగా సాగే కథా చిత్రం. 20 వేల సంవత్సరాల క్రితం అడవి ప్రాంతాల్లో నివశించే జాతికి చెందిన కొందరు వారి జీవనాధారమైన వేటకు వెళతారు. అందులో ఒక కుర్రాడు తప్పిపోతాడు. ఆ కుర్రాడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. అదే పరిస్థితిలో ఉన్న తోడేలు ఆ కుర్రాడికి తారస పడడం వారి మధ్య స్నేహబంధం ఏర్పడడం, అనంతరం ఎదురైన సమస్యలను ఎలా కలిసి ఎదుర్కొన్నారు? లాంటి పలు ఆసక్తికరమైన, ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో సాగే చిత్రం ఆల్ఫా. నాయకుడు లేనప్పుడు నువ్వే నాయకుడిగా మారాలి అన్న తండ్రి మాటల ప్రభావంతో తప్పిపోయిన ఆ కుర్రాడు ఎలా శత్రువులను ఎదుర్కొన్నాడు? లాంటి సాహసోపేతమైన సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. కొడి స్మిత్ మెక్ఫీ, లెఓనర్ వరేలా, జెన్స్హల్టెన్, జోహన్స్ హక్కర్ జోహన్సన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, సహ నిర్మాత, దర్శకత్వం బాధ్యతలను ఆల్బర్ట్ హగ్స్ నిర్వహించారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, ఆంగ్లం భాషల్లో సోనీ పిక్చర్స్ సంస్థ 24న భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు చేస్తోంది. -
మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ ఆటో ‘ఈ ఆల్ఫా’
ధర రూ.1.12 లక్షలు న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా గురువారం మార్కెట్లో ఈ ఆల్ఫా పేరుతో ఆటోరిక్షాను విడుదల చేసింది. దీని ధర ఢిల్లీ ఎక్స్ షోరూమ్ రూ.1.12 లక్షలుగా ప్రకటించింది. ఐదుగురు కూర్చునే సామర్థ్యం గల ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 85 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం 25 కిలోమీటర్లు. మహీంద్రా ఇప్పటికే పలు రకాల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. వీటిలో ఈ వెరిటో, ఈ20 ప్లస్ ఉన్నాయి. చివరి మైలు వరకు చేరుకునేందుకు ఈ ఉత్పత్తి దోహదపడుతుందని ఆటో రిక్షా విడుదల సందర్భంగా ఎంఅడ్ఎం ఎండీ పవన్ గోయెంకా మీడియాతో అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్ ఫోలియో విస్తరణపై దృష్టి పెట్టామని, రానున్న రోజుల్లో ఈ విభాగం నుంచి మ రిన్ని ఉత్పత్తులు విడుదల చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఈ విభాగంపై ఇప్పటికే రూ.500 కోట్లు ఇన్వెస్ట్ చేశామని, మరో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఉత్పత్తిని నెలకు 500 యూనిట్ల నుంచి రానున్న కొన్ని నెలల్లో 1,000 యూనిట్లకు, కొన్నేళ్లలో 5,000 యూనిట్లకు తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. -
‘ఐఫా’కు దక్షిణాది సినీ పరిశ్రమ
చెన్నై, సాక్షి ప్రతినిధి : ఫార్చున్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్రధాన స్పాన్సర్‌గా ఐఫా దక్షిణాది సినీ ఉత్సవాలను డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్ గచ్చిబౌలీ స్టేడియంలో నిర్వహిస్తున్న సందర్భంగా ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ ప్రధాన నిర్వాహక సంస్థ విజ్‌క్రాఫ్ట్ డెరైక్టర్ విరాఫ్ సర్కార్ మాట్లాడుతూ భారతీయ సినిమాఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ఐఫా 16 ఏళ్ల క్రితం ప్రారంభమైందని తెలిపారు. దక్షిణభారత నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్ మాట్లాడుతూ హిందీ సినీ పరిశ్రమతో ప్రారంభమైన ఐఫా దక్షిణాదికి విస్తరించడం సంతోషదాయకమని చెప్పారు. కేవలం వినోదం కోసం గాక సామాజిక బాధ్యతతో ఈ వేడుకలను నిర్వహించడం గర్వకారణమన్నారు. ఏడాదికి వెయ్యి సినిమాలు నిర్మితమవుతున్న దక్షిణాదికి ఐఫా చేరుకోవడం సముచితమైన నిర్ణయమని భారత ఫిలిం ఫెడరేషన్ ఉపాధ్యక్షులు రవి కొట్టార్కర అన్నారు. ఐఫా వేడుకలతో దక్షిణాది ప్రతిభ ప్రపంచానికి తెలియాలని ప్రముఖ దర్శకులు పీ వాసు అన్నారు. అదాని గ్రూపు సీవోవో అన్షుమాలిక్ మాట్లాడుతూ ఐఫా పుట్టినపుడే ఆదాని పుట్టిందని, అదే స్థాయిలో ప్రగతి పథంలో పయనిస్తోందని చెప్పారు. ఐఫా వేడుకల్లో అదాని భాగస్వామ్యం కావడం ఆనందకరమన్నారు. నిర్వాహకురాలు గీత మాట్లాడుతూ దక్షిణాది పరిశ్రమలోని టాలెంట్‌ను ప్రపంచానికి చాటేలా ఐఫా వేడుకలు సాగుతాయని, ఎంట్రీల ద్వారా విజేతల ఎంపిక జరుపుతామని తెలిపారు. విజేతల ఎంపిక పారదర్శకంగా సాగాలని నిర్మాత కే ప్రసాద్ సూచించారు. మీడియా పార్టనర్‌గా తామున్నందుకు గర్వపడుతున్నామని సన్‌నెట్‌వర్క్ ప్రతినిధి అనూజ అయ్యర్ అన్నారు. నటుడు మాధవన్, నటీమణులు హన్సిక, సిమ్రాన్, నమిత, రోహిణి, పూజాకుమార్ ఐఫాకు అభినందనలు తెలిపారు. -
హైదరా‘మ్యాటిక్స్!’
హైదరాబాద్‌కూ మ్యాథమేటిక్స్కూ చాలా దగ్గరి సంబంధం ఉందేమో అనిపిస్తుంటుంది. హైదరాబాదీయులు లెక్కలనూ, వాటిలో ఉపయోగించే సింబల్స్నూ విపరీతంగా గౌరవిస్తారేమో అని నా అనుమానం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే అతి పెద్ద హోటల్ ‘ఆల్ఫా’ హోటల్. సిటీకి వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో దిగాక ‘ఆల్ఫా’ హోటల్లో టీ తాగని వాడంటూ ఎవడూ ఉండడు. ఏదో ఒక సందర్భంలోనైనా అక్కడికి వెళ్లాల్సిందే. ఆల్ఫా టీ తాగాల్సిందే. ఒక్క ప్రతిష్ఠాత్మకమైన ఆ చాయ్ హోటల్కేమిటీ... నల్లగొండ క్రాస్ రోడ్డు దగ్గర సంతోష్‌నగర్ వైపుకు వెళ్లే ఫ్లై ఓవర్‌ను మామూలుగా కట్టకుండా అచ్చం అలా ఆల్ఫా ఆకారంలో ఒక మెలిక తిరిగి పైకి వెళ్లేలా సదరు ఫ్లై ఓవర్ నిర్మాణం చేశారు మన హైదరాబాదీ ఇంజనీర్లు. దీన్నిబట్టి మ్యాథమెటికల్ సింబల్స్‌కు మనం ఎంత ప్రాధాన్యం ఇస్తామో తెలియడం లేదూ? ఇక ఇక్కడి చారిత్రక ఉస్మానియా యూనివర్సిటీ మోనోగ్రామ్‌ను ఎప్పుడైనా గమనించారా? తిన్నగా, పొడుగ్గా ఉండే గీతను చెరిపేశాక ‘బీటా’ గుర్తును తిరగేసినట్టూ లేదా బీటాలోని పెద్ద నిలువు గీతను చెరిపేసి మిగిలిన దాన్ని అద్దంలో చూసినట్టూ ఉంటుంది. (వాస్తవానికి ఉస్మానియా అనే మాట ఉర్దూలోని ‘ఐన్’ అనే అక్షరంతో మొదలవుతుంది కాబట్టే ఆ ఉర్దూ అక్షరాన్ని మోనోగ్రామ్గా వాడారు). ఇక రోడ్ల పేర్ల విషయానికి వద్దాం. ఆ రోడ్డనీ, ఈ రోడ్డనీ లేదు... ప్రతి చౌరస్తాకూ క్రాస్‌రోడ్స్ అనే మాటకు బదులుగా ‘ఎక్స్’ రోడ్స్ అనడం ఇక్కడి ఆనవాయితీ. నల్లగొండ ఎక్స్ రోడ్స్, బాలానగర్ ఎక్స్ రోడ్స్... ఇలాంటి ఎక్స్ రోడ్లు ఎన్నో, ఎన్నెన్నో. ఇక కూకట్‌పల్లికి వెళ్తుంటే.. దాని మొదట్లో బాలానగర్‌కు వెళ్లే రోడ్డు మార్గం చీలికను ‘వై’ జంక్షన్ అంటారు. మన ఫేమస్ ‘వై’ జంక్షన్ ఒక పెద్ద ల్యాండ్ మార్క్ కూడా. ఇక మన నగరంలోని ఫ్లై ఓవర్ల రూపానికి వద్దాం. అవన్నీ బోర్లించిన బ్రాకెట్లలా ఉంటాయి. ఇక రోడ్లు స్ట్రెయిట్‌గా ఉండకుండా... మీసాల బ్రాకెట్లలా ఒంపులు తిరుగుతాయి. వాటికి తగ్గట్టే వాహనాలూన్నూ. ఇక నగరానికి తలమానికం అయిన చార్మినార్‌ను చూడండి. మీనార్లను మినహాయించి చూస్తే అచ్చం 22/7 విలువ ఉన్న ‘పై’ ఆకృతిలో ఉంటుంది. అలనాటి నవాబులు ఇలా ఎందుకు కట్టించారా అని కాసేపు ఆలోచిస్తే నాకొకటి తోచింది. ‘పై’ను అనగా... ఇరవై రెండూ బై ఏడును భాగిస్తున్న కొద్దీ దాని విలువ ఎప్పటికీ ముగియకుండా అలా ఇన్ఫినిటీలా సాగిపోతూనే ఉంటుంది కదా. అలాగే మన నగరం అభివృద్ధి కూడా ‘పై’ విలువలాగే ఎప్పటికీ ఆగిపోకుండా అలా ప్రవర్ధమానమైపోతూ ఉండాలన్నదే అలనాటి హైదరాబాదీ నిర్మాతల లక్ష్యం కాబోలు. అందుకే ఇది ఎప్పుడూ ‘పై’నే! ‘పై’ విలువలా అనంతమే!! వెరసి ఇది ‘ఓమెగా’ సిటీ... అబ్బే మీరనుకుంటున్నట్లు మ్యాథమెటికల్ సింబల్ కాదు... విడమర్చి చూస్తే.. ‘ఓ... మెగా... సిటీ’ అన్నమాట! - యాసీన్