Alia Bhatt To Sita RRR Movie Making Video Goes Viral - Sakshi
Sakshi News home page

Alia Bhatt RRR Making Video: అలియా భట్‌ సీతగా ఎలా మారిందో చూశారా ?.. మేకింగ్‌ వీడియో వైరల్

Dec 8 2021 1:07 PM | Updated on Dec 8 2021 1:39 PM

Alia Bhatt To Seetha Making Video From RRR Movie - Sakshi

Alia Bhatt To Seetha Making Video From RRR Movie: ధర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ జూ. ఎన్టీఆర్ కాంబినేషనల్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మల్టీసారర్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. వీరి ముగ్గురి కాంబినేషన్‌లో వస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'పై సినిమాకు బడ్జెట్‌కు (సుమారు రూ. 450 కోట్లు) మించిన ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. జనవరి 7, 2022న వస్తున్న ఈ సినిమా సంక్రాంతి సీజన్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వబోతోందని టాలీవుడ్‌ గట్టిగా నమ్ముతోంది. రేపు (డిసెంబర్ 9) ట్రైలర్‌ రాబోతుంది. ఈ ట్రైలర్‌ను తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానమైన థియేటర్లలో ప్రదర్శించబోతోంది చిత్రబృందం. 

ఈ చిత్రం​ నుంచి ఇప్పటికే  ఎన్టీఆర్, రామ్ చరణ్‌ పోస్టర్లు, వీడియోలు, పాటలు విడుదల చేశారు. వాటికి అనూహ్య స్పందన వస్తోంది. తాజాగా అలియా భట్‌ పాత్రకు సంబంధించిన ఒక వీడియోను రీలీజ్‌ చేసింది చిత్రబృందం. ఈ తాజా వీడియోలో అలియా నుంచి సీతగా మారే క్రమాన్ని చూపించారు. బాలీవుడ్ బ్యూటీ అలియా.. ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళితో చర్చలు జరపడం దగ్గర నుంచి సీత పాత్రలో ఒదిగిపోయే వరకు చూపించారు. అందులో అలియా పోషిస్తున్న సీత పాత‍్రను తయారు చేసే విధానం, యాక్టింగ్ సీన్స్‌ను చూపించారు. వీడియోలోని బిహైండ్‌ సీన్స్‌లో అలియా భట్‌  క్యూట్‌ క్యూట్‌గా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ముచ్చటగా కనిపించింది. ఇందులో పదహారణాల తెలుగమ్మాయిగా అలియా ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. ఇందులో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా పాత్ర కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుందని సమాచారం. అలియాది.. ఇద్దరు మహావీరుల మధ్య ఆమె రిలీఫ్ అని సీత పాత్ర ప్రేక్షకుల మనసులు దోచుకుంటుందని.. రామారాజు, భీమ్ ల మధ్య ఆమె ఒక కనెక్టింగ్ అంశమని ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement