
సెలెబ్రిటీ కపుల్ పెళ్లి ఇప్పట్లో లేనట్టే..
ముంబై : బాలీవుడ్‌లో హాట్ లవ్ కపుల్‌గా ప్రచారం సాగుతున్న రణ్‌బీర్ కపూర్, అలియా భట్‌ల అనుబంధం ఇప్పట్లో పెళ్లిపీటలకు ఎక్కడం లేదని వెల్లడైంది. అలియా భట్ తన పెళ్లి కోసం అప్పుడే వెడ్డింగ్ లెహెంగా కోసం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీకి ఆర్డర్ ఇచ్చినట్టు వార్తలు రాగా అలియా కుటుంబ సభ్యులు అలాంటిదేమీ లేదని తేల్చేశారు. రణ్‌బీర్ కపూర్‌తో అలియా భట్ వివాహంపై వస్తున్నవన్నీ రూమర్లేనని ఆమె అంకుల్, నిర్మాత ముఖేష్ భట్ కొట్టిపారేశారు.
ఇవన్నీ అసత్య వార్తలే..అసలు వీటిని ఎవరు పుట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మరోవైపు అలియా స్టెప్ బ్రదర్ రాహుల్ భట్ సైతం ఆమె పెళ్లి వార్తలను తోసిపుచ్చారు. అలియా, రణ్‌బీర్‌ల వివాహంపై తనకేమీ తెలియదని, వారిద్దరి పెళ్లికి తనను ఆహ్వానిస్తే తాను తప్పకుండా వెళతానని చెప్పుకొచ్చారు.