
సల్మాన్‌ఖాన్ సినిమాలు రంజాన్‌కు విడుదల అవడం కొత్తేమీ కాదు. ‘వాంటెడ్’, ‘దబాంగ్’ ‘కిక్’, ‘బజరంగీ భాయిజాన్’, ‘సుల్తాన్’ ‘ట్యూబ్‌లైట్’ ‘రేస్ 3’.. ఈ ఏడాది ‘భారత్’ ఈ చిత్రాలన్నీ ఈ లిస్ట్ లోనివే. ఈ క్రమంలో వచ్చే ఏడాది రంజాన్‌కు తన ‘ఇన్‌షా అల్లా’ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు సల్మాన్‌ఖాన్. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా నటించనున్న చిత్రం ‘ఇన్‌షా అల్లా’. ఆలియాభట్ కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దాదాపు ఇరవైఏళ్ల తర్వాత సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో నట్తిస్తున్నారు సల్మాన్. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ (1999) సినిమా వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment