స్క్రీన్‌ టెస్ట్‌ | tollywood movies special screen test | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Fri, Mar 8 2019 5:55 AM | Last Updated on Fri, Mar 8 2019 5:55 AM

tollywood movies special screen test - Sakshi

హీరోయిన్‌ అంటే తెరపై కనిపించడం వరకే అనే రోజులు మొదటి తరంలోనే లేవు. తెరపై రాణించడంతో పాటు తెర వెనక కూడా సాంకేతిక నిపుణులుగా సత్తా చాటిన, చాటుతున్న నాయికలు ఉన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆ ప్రతిభావంతుల గురించి స్పెషల్‌ క్విజ్‌.

1. తెలుగు చలన చిత్రరంగంలో మొదటితరం సూపర్‌స్టార్‌ ఈమె. సినిమాకి సంబంధించిన అనేక శాఖల్లో ఈమెకు టాలెంట్‌ ఉండటం వల్ల ‘అష్టావధాని’ అనేవారు. అలా బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న ఈ ప్రముఖ నటి ఎవరు?
ఎ) సావిత్రి    బి) భానుమతి సి) వాణిశ్రీ    డి) జమున

2. 1990లలో లేడీ సూపర్‌స్టార్‌ అనిపించుకున్న నటి ఆమె. తెలుగులో హీరోలకు సమానంగా పారితోషికం తీసుకున్నారామె. ఎవరా నటి?  
ఎ) రాధిక           బి) ఖుష్బూ సి) విజయశాంతి  డి) రాధ

3. కె. బాలచందర్‌ దర్శకత్వం వహించిన ‘సింధుభైరవి’కి నేషనల్‌ అవార్డును సొంతం చేసుకున్న ఆ చిత్రకథానాయిక ఎవరు? (చిన్న క్లూ: కథానాయిక కాకముందు ఆమె కెమెరా శాఖలో చేశారు)
ఎ) సుహాసిని   బి) సుమలత  సి) ఆమని     డి) సరిత

4. ‘అరుంధతి’ ‘రుద్రమదేవి’ ‘భాగమతి’ ఇలా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ పాత్రలకు చిరునామాగా మారారు అనుష్క. కానీ ఈమె తన మొదటి సినిమాలో కిలాడి లేడీగా నటించారు. అనుష్కను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడెవరో తెలుసా?
ఎ) ఎస్‌.ఎస్‌. రాజమౌళి బి) త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సి) పూరి జగన్నాథ్‌ డి) శ్రీను వైట్ల

5. తమిళ నటుడు ‘శివాజీ గణేశన్‌’ని డైరెక్ట్‌ చేసిన నటీమణులు ఇద్దరే ఇద్దరు. అందులో ఒకరు సావిత్రి. మరో దర్శకురాలు ఎవరో కనుక్కోండి?
ఎ) సుజాత  బి) కన్నాంబ సి) భానుమతి డి) విజయనిర్మల

6. ఆమె అసలు పేరు సరస్వతి. మూడు సార్లు నేషనల్‌ అవార్డు పొందారు. ఆ నటి పేరేంటి? (ఆమె తెలుగులో ఎంత పాపులరో మలయాళంలో కూడా అంతే పాపులర్‌)
ఎ) శారద        బి) కాంచన    సి) అంజలీదేవి   డి) ‘షావుకారు’ జానకి

7. జపాన్, జర్మన్, ఇంగ్లీషు భాషల్లోని పాటలతో పాటు మొత్తం 17 భాషల్లో తన గళాన్ని వినిపించారు ఈమె. వేల పాటలు పాడిన ఆ ప్రముఖ సింగర్‌ ఎవరో కనుక్కోండి?
ఎ) వాణీ జయరాం  బి) పి.సుశీల  సి) చిత్ర             డి) ఎస్‌. జానకి

8. 1994లో మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని సొంతం చేసుకున్నారీమె. ఆ తర్వాత కథానాయికగా కూడా రాణించారు. ‘సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా’ అంటూ నాగార్జునతో స్టెప్పులేసిన ఆ అందాల సుందరి ఎవరు?
ఎ) సుస్మితా సేన్‌ బి) ప్రియాంకా చోప్రా  సి) దియా మీర్జా  డి) మాధురీ ధీక్షిత్‌

9. ప్రముఖ తమిళ రచయిత వైరముత్తుపై ‘మీటూ’ ఆరోపణలు చేసిన ప్రముఖ సింగర్, డబ్బింగ్‌ కళాకారిణి ఎవరు?
ఎ) కస్తూరి     బి) శ్రీరెడ్డి   సి) చిన్మయి     డి) కల్పన

10. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌గా 7 సంవత్సరాలు పని చేశారీమె. 2010లో ‘ద్రోహి’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీసి తమిళ, హిందీ, తెలుగు భాషల్లో విజయం సాధించారు. ఎవరా దర్శకురాలు?
ఎ) సుధా కొంగర  బి) నందినీ రెడ్డి   సి) అంజనా            డి) చునియా

11. నెల్లూరులో పుట్టిన ఈ నటి పేరు రత్నకుమారి. 1966లో నటి జమున పక్కన చిన్న చెలికత్తె వేషంలో నటించారీమె. తర్వాత కాలంలో ఆమె చాలా పెద్ద హీరోయిన్‌ అయ్యారు. ఆమెవరో తెలుసా?
ఎ) జయంతి బి) శారద  సి) వాణీశ్రీ   డి) ‘షావుకారు’ జానకి

12. 1994లో శేఖర్‌ కపూర్‌ దర్శకత్వం వహించిన ‘బాండిట్‌ క్వీన్‌’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన అస్సామీ నటి పేరేంటి?
ఎ) సీమా బిస్వాస్‌  బి) ఆషిమాల్లా  సి) పాంచీ బోరా   డి) నేహా జుల్కా

13. శివాజీగణేశన్‌తో 17 సినిమాలు, యన్టీఆర్‌ కాంబినేషన్‌లో 12 చిత్రాలు, అక్కినేనితో 8 చిత్రాల్లో నటించిన ఈ ప్రముఖ హీరోయిన్‌ ఎవరో కనుక్కోండి ? ( క్లూ: 2016లో ఆమె మరణించారు)
ఎ) అంజలీదేవి    బి) సావిత్రి   సి) కృష్ణకుమారి   డి) జయలలిత

14. ఇద్దరు టీవీ యాంకర్లను హీరో, హీరోయిన్‌లుగా పరిచయం చేస్తూ, దర్శకుడు దాసరి నారాయణరావు ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ అనే సినిమా తీశారు. అందులో హీరోగా చేసింది అప్పటి యాంకర్, ఇప్పటి ఫిల్మ్‌ డైరెక్టర్‌ వక్కంతం వంశీ. మరి ఈ హీరోయిన్‌ ఎవరు?
ఎ) సుమ           బి) ఝాన్సీ   సి) ఉదయభాను  డి) శిల్పా చక్రవర్తి

15. తమిళంలో కె.బాలచందర్, తెలుగులో కె.రాఘవేంద్రరావు ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేశారు. ‘మిస్టర్‌ ఇండియా’ చిత్రంలో క్రైమ్‌ రిపోర్టర్‌. ఆమె పేరేంటి?
ఎ) శ్రీదేవి బి) జయప్రద సి) రేఖ డి) హేమమాలిని

16. మలయాళీ బ్యూటీ విద్యాబాలన్‌ బాలీవుడ్‌లో హోమ్లీ క్యారెక్టర్స్‌తో కెరీర్‌ స్టార్ట్‌ చేశారు. ఆ తర్వాత ఓ ఐటెమ్‌ సాంగ్స్‌ క్వీన్‌ బయోపిక్‌ ‘ది డర్టీ పిక్చర్‌’లో హాట్‌గా కనిపించారు. ఇంతకీ ఆ ఐటెమ్‌ క్వీన్‌ ఎవరో తెలుసా?
ఎ) జయమాలిని  బి) సిల్క్‌ స్మిత  సి) అనూరాధ     డి) జ్యోతిలక్ష్మీ

17. 13వ శతాబ్దానికి చెందిన ‘పద్మావత్‌’ కథను అద్భుతంగా చూపించారు ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ. పద్మావతిగా నటించిన బాలీవుడ్‌ బ్యూటీ ఎవరు?
ఎ) కరీనా కపూర్‌ బి) అలియా భట్‌  సి) దీపికా పదుకొనే డి) ప్రియాంకా చోప్రా

18. తెలుగు ప్రేక్షకులకు ‘దేవదాసు’ అనగానే అక్కినేని, సావిత్రి గుర్తుకొస్తారు. అదే పేరుతో బాలీవుడ్‌లో 2002లో షారుక్‌ ఖాన్‌ ఓ సినిమా చేశారు. అందులో దేవ్‌గా షారుఖ్‌ ఖాన్‌ నటించారు. మరి పార్వతిగా నటించింది ఎవరో కనుక్కోండి?
ఎ) కాజోల్‌       బి) రాణీ ముఖర్జీ   సి) ప్రీతీ జింటా  డి) ఐశ్వర్యా రాయ్‌

19. ‘ఓం శాంతి ఓం’ చిత్రంతో దీపికా పదుకొనే లాంటి స్టార్‌ బాలీవుడ్‌కు లభించారు.   ఆమెను ఆ చిత్రం ద్వారా పరిచయం చేసిన ప్రముఖ దర్శకురాలెవరు?
ఎ) దీపామెహతా బి) ఫరాఖాన్‌ సి) జోయాఅక్తర్‌  డి) కొంకణాసేన్‌ శర్మ

20. ‘మిత్ర్‌.. మైఫ్రెండ్‌’ అనే ఇంగ్లిష్‌ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించి నేషనల్‌ అవార్డు సొంతం చేసుకున్న దక్షిణ భారత నటి ఎవరో తెలుసా?
ఎ) రేవతి  బి) భానుప్రియ సి) శ్రీప్రియ  డి) గౌతమి

సమాధానాలు
1) (బి) 2) (సి) 3) (ఎ) 4) (సి) 5) (డి) 6) (ఎ) 7) (డి) 8) (ఎ) 9) (సి) 10) (ఎ)  11) (సి)

12) (ఎ) 13) (డి) 14) (ఎ) 15) (ఎ) 16) (బి) 17) (సి) 18) (డి) 19) (బి) 20) (ఎ)


మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

నిర్వహణ: శివ మల్లాల

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement