బాలీవుడ్ నటి అలియా భట్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, ముంబయి : కాస్టింగ్ కౌచ్‌పై విస్తృత చర్చ సాగుతున్న క్రమంలో బాలీవుడ్ భామ అలియా భట్ స్పందించారు. కాస్టింగ్ కౌచ్ ఒక్కసారిగా ప్రధాన అంశంగా ముందుకొచ్చిందని, ఇలాంటి అంశాలు చర్చకు రాగానే వాతావరణమంతా ప్రతికూలంగా మారుతుందని వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమ గురించి ప్రజలు చెడుగా ఆలోచించడం ప్రారంభిస్తారన్నారు. కాస్టింగ్ కౌచ్ తనకెప్పుడూ ఎదురవలేదని చెప్పుకొచ్చారు. అయితే అవకాశాల కోసం యువతీ యువకులు పరిశ్రమలో సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతారన్నారు. ఈ క్రమంలో వారి బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తారని అలియా భట్ వ్యాఖ్యానించారు.
కాస్టింగ్ కౌచ్ ప్రపంచవ్యాప్తంగా ఉందని దీన్ని ఎదుర్కొనేందుకు నటీనటులు తమపై తాము విశ్వాసం ఉంచాలన్నారు. ఇలాంటి అనుభవం ఎదురైతే తక్షణమే తల్లితండ్రులకు సమాచారం ఇవ్వడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు. కాస్టింగ్ కౌచ్ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కాస్టింగ్ కౌచ్‌ను సమర్థిస్తూ సరోజ్ ఖాన్, శత్రుజ్ఞ సిన్హా చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపగా, ఈ విష సంస్కృతిపై పెద్దసంఖ్యలో హీరోయిన్లు గళమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment