తెలుగు నేపథ్యం ఉన్న బ్యూటీ అదితి రావు హైదరి అటు బాలీవుడ్‌తోపాటు ఇటు సౌత్ ఇండస్ట్రీలోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. 2006లో మాలీవుడ్ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ భామ.. మధ్యలో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆ గ్యాప్‌కు కారణం ఏంటన్నది తాజాగా సండే గార్డియన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు.
కాస్టింగ్ కౌచ్ మూలంగానే కొన్ని నెలలపాటు ఆమె సినిమాలకు దూరం అయ్యారంట. ‘2013లో ఓ బాలీవుడ్ మేకర్ నా దగ్గరికొచ్చి ఓ సినిమా ఆఫర్ ఉందని చెప్పాడు. అయితే అందుకోసం నేను కాంప్రమైజ్ కావాలంటూ కోరాడు. చిర్రెత్తుకొచ్చేసింది. అక్కడి నుంచి వెళ్లిపోయా. ఏడ్చేశా.. ఎంత ధైర్యం వాడికి?.. ఇలాంటి తప్పుడు దారుల్లో ప్రయాణించి అనుకున్నది సాధించటం నాకు అవసరమా అనిపించింది. కొన్ని నెలలు ఖాళీగా ఉన్నా. కానీ, కొంత కాలానికి అవకాశాలు వాటికవే రావటం ప్రారంభించాయి. టాలెంట్ ఉంటే నిజాయితీగా సినిమాల్లో రాణించొచ్చన్న విషయం అప్పుడు అర్థమైంది’ అని ఆమె తెలిపారు.
కాస్త ఓపికగా ఉంటే సరైన అవకాశాలు వచ్చి పడతాయని, అందుకే తానే ఉదాహరణ అని ఆమె కొత్తవాళ్లకు సలహా ఇస్తున్నారు. ఈ మధ్యే ‘సమ్మోహనం’తో మెరిసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం అదితి మణిరత్నం మల్టీస్టారర్ ప్రాజెక్టు ’చెక్కా చివంత వానమ్’తోపాటు సుధీర్ మిశ్రా ‘దాస్ దేవ్’లో కూడా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment