రణ్‌బీర్‌తో అనుబంధంపై అలియా రిప్లై | Alia Bhatt Denies The Rumours Of Her Moving In With Ranbir Kapoor | Sakshi
Sakshi News home page

రణ్‌బీర్‌తో అనుబంధంపై అలియా రిప్లై

Published Tue, Apr 23 2019 7:53 PM | Last Updated on Tue, Apr 23 2019 7:53 PM

Alia Bhatt Denies The Rumours Of Her Moving In With Ranbir Kapoor - Sakshi

ముంబై : బాలీవుడ్‌లో లవ్‌ బర్డ్స్‌గా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ల అనుబంధంపై రోజుకో వార్త హల్‌చల్‌ చేస్తోంది.వీరిద్దరూ కలిసి ఇటీవల ముంబైలో ఓ డిజైన్‌, ఆర్కిటెక్చర్‌ సంస్ధను సందర్శించడంతో బాలీవుడ్‌లో వదంతులు తీవ్రమయ్యాయి. గత ఏడాదిగా వీరు డేటింగ్‌లో ఉన్నా తమ రిలేషన్‌షిప్‌పై నోరుమెదపకపోవడం కూడా బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

మరోవైపు ఇటీవల ఓ అవార్డుల కార్యక్రమంలో వీరిద్దరి సాన్నిహిత్యం చూసిన వారు సైతం త్వరలో వివాహ బంధంతో వీరు ఒక్కటవుతారని భావించారు. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని అలియా భట్‌ తేల్చేశారు. పెళ్లి గురించి ఆలోచించే వయసు తనకు లేదని..రణ్‌బీర్‌తో దృఢమైన బంధం అవసరమని తాను అనుకుంటే అప్పుడు దాని గురించి ఆలోచిస్తానని, ఇప్పటికైతే తాను తన పనినే ప్రేమిస్తున్నానని, ఈ దిశగా తన పయనం కూడా సంతృప్తిగా సాగుతోందని అలియా బదులిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement