
ఆలియా భట్
ఓ ఇంటికి కోడలిగా వెళ్లిన తర్వాత కొందరు కథానాయికలు యాక్టింగ్‌కు బై బై చెబుతారు. పెళ్లి తర్వాత మరికొందరు స్మాల్ బ్రేక్ ఇచ్చి, మళ్లీ కెమెరా ముందుకు వస్తారు. ఆఫ్టర్ మ్యారేజ్ లాంగ్ బ్రేక్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ అంటూ షూట్‌లోకి అడుగుపెడతారు ఇంకొందరు కథానాయికలు. ఇలా పెళ్లి తర్వాత కథానాయికలు కెరీర్ గ్రాఫ్‌లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. మరి... మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఇదే స్పీడ్‌లో యాక్ట్ చేస్తారా? అన్న ప్రశ్నను ఆలియా ముందు ఉంచితే... ‘‘పెళ్లి చేసుకున్నంత మాత్రాన కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలన్నా, అవకాశాలు తగ్గిపోతాయని ఎవరైనా అన్నా నేను ఒప్పుకోను. ప్రతిభ ఉంటే చాన్సులు ఆగవు.
ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ జర్నీకి పెళ్లితో సంబంధం లేదని నా ఫీలింగ్. ఈ విషయాన్ని అనుష్కా శర్మ, సోనమ్ కపూర్ ఆల్రెడీ ప్రూవ్ చేశారు కూడా. నేనూ అలాగే కొనసాగుతాను. మంచి యాక్టర్ కెరీర్‌ను రిలేషన్‌షిప్ స్టేటస్ ప్రభావితం చేయదు’’ అని అంటున్నారు ఆలియా భట్. అలాగే రణ్‌బీర్ కపూర్‌తో రిలేషన్ ఏంటీ? అన్న ప్రశ్నకు మాత్రం–‘‘అమేజింగ్ కో స్టార్’’ అంటూ తెలివిగా మాట దాటేశారు. కానీ, వారిద్దరి పెళ్లి గురించి మీడియాలో వస్తున్న గాసిప్‌లకు ఫుల్‌స్టాప్ పెట్టలేదు. ప్రస్తుతం ‘కళంక్, బ్రహ్మాస్త్ర’ సినిమాల షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు ఆలియా.
Comments
Please login to add a commentAdd a comment