
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కొత్త కారును లాంచ్ చేసింది. ‘ఎం2 కాంపిటీషన్’ పేరుతో గురువారం ఈ లగ్జరీ కారును విడుదల చేసింది. దీని ధర రూ.79.9 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. తక్షణమే భారతదేశంలో అన్ని బీఎండబ్ల్యూ డీలర్ల వద్ద పెట్రోల్ వేరియంట్‌గా అందుబాటులో ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎం2 కాంపిటీషన్‌లో మూడు లీటర్ల ఆరు సిలిండర్ పెట్రోల్ ఇంజీన్‌ను అమర్చింది. 4.2 సెకన్లలో 100కి.మీ., గరిష్టంగా గంటకు 250 కి.మీ వేగం అందుకుంటుంది.
Introducing the all new BMW M2 Competition. Precision redefined.
Know more at : https://t.co/Ir4SnIqoTl pic.twitter.com/mGWwTzsPMO
— BMW India (@bmwindia) November 15, 2018