Akkineni Chaitanya
-
సామాన్యుడిలా వచ్చిన నాగ చైతన్య.. ఏం చేశాడంటే?
అక్కినేని హీరో నాగ చైతన్య కస్టడీ చిత్రంతో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించారు. వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కించిన ద్విభాషా చిత్రం అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యారు టాలీవుడ్ యంగ్ హీరో. (ఇది చదవండి: అలాంటి నటించడమే తనకు చాలా ఇష్టం: యంగ్ హీరోయిన్) లవ్ స్టోరీ తర్వాత మళ్లీ చై, సాయి పల్లవి కలిసి తెరపై కనిపించనున్నారు. ఈ సూపర్ హిట్ జోడీ తెరపై మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంతో పాటు మరోవైపు ఇష్క్ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న హారర్ వెబ్ సిరీస్‌లో నటించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, తరుణ్ భాస్కర్ కనిపించనున్నారు. అయితే తాజాగా నాగ చైతన్య హైదరాబాద్‌లో సందడి చేశారు. ఓ పెట్రోల్ బంక్‌లో తన ఖరీదైన ఫెరారీ కారులో దర్శనమిచ్చారు. ఓ సామాన్యుడిలా వచ్చి పెట్రోల్ బంక్‌లో కనిపించారు. అయితే నాగ చైతన్య వచ్చిన కారుపై అందరి దృష్టి పడింది. చైతూ వచ్చిన రెడ్ కలర్ ఫెరారీ కారు దాదాపు రూ.4 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది చూసిన నాగ చైతన్య ఫ్యాన్స్ సైతం సూపర్ అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: వరుణ్- లావణ్య పెళ్లి.. నిహారికను ఫాలో అవుతోన్న కాబోయే కోడలు!) View this post on Instagram A post shared by anush7697 (@anush7697) -
హైదరాబాద్ లో మోటోప్లెక్స్ ఔట్లెట్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ పియాజియో ఇండియా దక్షిణాదిన తొలి రిటైల్ స్టోర్ మోటోప్లెక్స్ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. శ్రేయ్ ఆటోమోటివ్స్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-36లో 4,134 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నెలకొల్పింది. సినీ హీరో అక్కినేని చైతన్య చేతుల మీదుగా గురువారం ప్రారంభించింది. భారత్‌లో కంపెనీకి ఇది రెండవ స్టోర్. తొలి ఔట్‌లెట్‌ను పుణేలో 2015 నవంబర్‌లో ప్రారంభించారు. పియాజియోకు చెందిన ప్రీమియం ఇటాలియన్ బ్రాండ్స్ అయిన అప్రీలియా, మోటో గుజ్జి, వెస్పా బ్రాండ్ ద్విచక్ర వాహనాలను ఇక్కడ విక్రయిస్తారు. అలాగే యాక్సెసరీస్ కొలువుదీరాయి. డిసెంబర్‌కల్లా మరో అయిదు మోటోప్లెక్స్ స్టోర్లు నెలకొల్పుతామని పియాజియో ఎండీ, సీఈవో స్టీఫానో పెల్లె ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. కస్టమర్లకు వినూత్న అనుభూతి కలిగించేందుకు మోటోప్లెక్స్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చామన్నారు. కార్యక్రమంలో శ్రేయ్ ఆటోమోటివ్స్ సీఈవో సుశీల్ దుగ్గార్ పాల్గొన్నారు.