జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి విషయంలోనూ బీజేపీ అనూహ్య నిర్ణయం వైపే మొగ్గు చూపించింది. ఓసీ సామాజిక వర్గానికి చెందిన భజన్‌లాల్ శర్మను సీఎంగా ప్రకటించింది. బీజేపీ శాసనసభాపక్షనేతగా భజన్‌లాల్ శర్మను మంగళవారం జరిగిన సీఎల్పీ భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. భజన్‌లాల్ తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గడం గమనార్హం. డిప్యూటీ సీఎంలుగా దియాకుమారి, ప్రేమచంద్ భైరవను బీజేపీ ప్రకటించింది. అదే విధంగా స్పీకర్ వాసుదేవ్ దేవ్‌నాని ఎంపిక చేసిదంది.
కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్, బీజేపీ పరిశీలకులు రాజస్థాన్ సీఎం ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. బీజేపీ ఎల్పీ ముగిసిన అనంతరం భజన్‌లాల్ శర్మ పేరును రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అధికారికంగా ప్రకటించారు.
ఇక రాజస్థాన్ ముఖ్యమంత్రి రేసులో వసుంధర రాజే, దియాకుమారి, అర్జున్‌రామ్, గజేంద్ర షెకావత్, అశ్విని వైష్ణవ్ లాంటి సీనియరల పేర్లు వినిపించాయి. తీవ్ర సస్పెన్స్ కొనసాగించిన అనంతరం బీజేపీ అధిష్టానం.. చివరి నిమిషంలో భజన్‌లాల్ పేరును తెరపైకి తెచ్చింది. చివరకు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తరహాలోనే రాజస్థాన్ విషయంలోనూ కొత్త ముఖాన్ని ఎంచుకుంది.
56 ఏళ్ల భజన్ లాల్ శర్మ.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు. భజన్ లాల్ రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో సంగనేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్‌పై 48,081 ఓట్లతో విజయం సాధించారు.
చదవండి: నెహ్రూపై అమిత్ షా వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment