రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ప్రస్తుతం బీజేపీ 108 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 75 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ ఫలితాలు విజయానికి దారితీస్తే గెహ్లాట్ ప్రభుత్వం నిష్క్రమణ ఖాయమనే అంచనాలు వెలువడుతున్నాయి.
అయితే రాజస్థాన్ ఎన్నికల లెక్కింపులో ఇద్దరు స్వతంత్ర ముస్లిం అభ్యర్థులతో సహా 15 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ముందంజలో ఉండటం విశేషం. భరత్‌పూర్ జిల్లాలోని కమాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముస్లిం అభ్యర్థి ముఖ్తార్ అహ్మద్ 17,748 ఓట్ల ఆధిక్యంతో ఉండగా, మరో ముస్లిం అభ్యర్థి యూనస్ ఖాన్.. దీద్వానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 20 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
భరత్‌పూర్ జిల్లాలోని కమాన్ అసెంబ్లీ స్థానం ముస్లిం ప్రాబల్యం ఉన్న సీటుగా గుర్తింపు పొందింది. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున నౌక్షం చౌదరి, కాంగ్రెస్ నుంచి జాహిదాఖాన్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడి ముక్కోణపు పోటీలో ముఖ్తార్ అహ్మద్ ముందంజలో ఉన్నారు. 2018లో జహీదా ఖాన్ 40 వేలకు పైగా ఓట్లతో గెలుపొందగా, ఈసారి మాత్రం వెనుకంజలో ఉన్నారు. బీజేపీ తన అభ్యర్థిగా హర్యానాకు చెందిన నౌక్షం చౌదరిని ఎన్నికల బరిలో నిలిపింది.
ఇది కూడా చదవండి: ‘జై శ్రీరాం’ నినాదాలతో కాంగ్రెస్ సంబరాలు
Comments
Please login to add a commentAdd a comment