రాజస్థాన్‌లోని కోట జిల్లాలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర నిరంతరం కొనసాగుతోంది. తాజాగా బీహార్‌కు చెందిన భార్గవ్ ఆత్మహత్యతో కోట కోచింగ్ సెంటర్లలో విద్యనభ్యసిస్తూ ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థుల జాబితాలో మారోపేరు చేరింది. తమ కుమారుడు భార్గవ్ మిశ్రా మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు కోటకు వచ్చిన మృతుని కుటుంబ సభ్యుల రోదన అక్కడున్నవారి హృదయాలను కలచివేసింది.
జేఈఈ కోచింగ్ కోసం వచ్చి..
17 ఏళ్ల భార్గవ్ మిశ్రా ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ కోసం 4 నెలల క్రితమే బీహార్‌లోని చంపారణ్ నుంచి కోట నగరానికి వచ్చాడు. ఇక్కడి మహావీర్ నగర్ ప్రాంతంలోని పీజీలో ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో జేఈఈ కాంపిటీటివ్ పరీక్ష కోసం సిద్ధం అవుతున్నాడు. తాజాగా భార్గవ్ తండ్రి కుమారునికి ఫోన్ చేయగా, కుమారుడు ఫోన్ తీయలేదు. ఎంతసేపు ప్రయత్నించినా కుమారుడు ఫోన్ రిసీవ్ చేసుకోకపోవడంతో తండ్రి కుమారుని ఇంటి యజమానికి ఈ విషయం తెలిపాడు.
ఉరి వేసుకున్న స్థితిలో భార్గవ్
వెంటనే ఇంటి యజమాని గది తలుపులు తట్టాడు. లోపలి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని కిటికీలో నుంచి గదిలోనికి తొంగిచూడగా, భార్గవ్ మిశ్రా ఉరి వేసుకున్న స్థితిలో కనిపించాడు. వెంటనే అతను ఈ సమాచారాన్ని మహావీర్ నగర్ పోలీసులకు తెలియజేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారి అవధేష్ కుమార్ మాట్లాడుతూ గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం దానిని ఎంబీఎస్ ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: వైట్‌హౌస్ భారతీయ- అమెరికన్ సలహాదారు కీలక నిర్ణయం.. ‘డ్యూక్’కు తిరుగుముఖం!
మెడికల్, ఇంజినీరింగ్ కోచింగ్ సెంటర్ల ఫ్యాక్టరీలు నడిచే కోటకు దేశం నలుమూలల నుంచి విద్యార్థులు తరలివస్తుంటారు. వీరు ఇంజినీర్లు లేదా డాక్టర్లు కావాలన్న తమ కలను నెరవేర్చుకునేందుకు తాపత్రయ పడుతుంటారు. ఇక్కడి కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఇచ్చే హామీలను నమ్మి, ఇక్కడ కోచింగ్ తీసుకుంటుంటారు. ఈ ఏడాది ఈ ప్రాంతంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిన నేపధ్యంలో కోట కోచింగ్ సెంటర్ల అంశం మరోమారు తెరపైకి వచ్చింది.
18కి చేరిన విద్యార్థుల ఆత్మహత్యలు
భార్గవ్ మిశ్ర ఆత్మహత్యతో ఈ ఏడాది ఇక్కడ విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 18కి చేరింది. ఇది అందరిలోనూ ఆందోళనను మరింతగా పెంచుతోంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోచింగ్ సెంటర్లకు పలు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులలో మోటివేషన్ తీసుకు వచ్చే చర్యలు చేపట్టాలని కోరింది. జిల్లా యంత్రాంగం ఒక కమిటీని ఏర్పాటు చేసి నిపుణుల సాయంతో విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తోంది.
స్థానిక పోలీసులు కూడా డెడికేటెడ్ స్టూడెంట్ సెల్‌ను ప్రారంభించారు. దీని ద్వారా విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ఏ సమయంలోనైనా తమకు ఫోన్ చేసి, తమ సహాయం తీసుకోవచ్చని విద్యార్థులకు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం 2లక్షలకు పైగా విద్యార్థులు కోటలో వివిధ కాంపిటీటివ్ పరీక్షలకు సిద్ధం అవుతున్నారని సమాచారం.
ఇది కూడా చదవండి: మళ్లీ పెళ్లికి సిద్ధమైన.. ముగ్గురు భార్యల ముద్దుల లాయర్‌కు దేహశుద్ది!
Comments
Please login to add a commentAdd a comment